Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్‌-దక్షిణాఫ్రికా!!

IND vs SA 1st Match Records Most Sixes In A Test Match Ever

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా చెలరేగి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. సొంత గడ్డపై ఏడాది జరిగిన టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. అయితే తొలి టెస్టు పలు రికార్డులను తిరగరాసింది.

35 సిక‍్సర్ల రికార్డు బద్దలు

35 సిక‍్సర్ల రికార్డు బద్దలు

వైజాగ్‌ టెస్టులో ఇరు జట్ల బ్యాట్స్‌మన్‌ 37 సిక్సర్లు బాదారు.దీంతో భారత్‌-దక్షిణాఫ్రికాలు ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన జట్లుగా నిలిచాయి. 2014-15 సీజన్‌లో పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు 35 సిక్సర్లు బాదాయి. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా-దక్షిణాఫ్రికాలు బ్రేక్‌ చేశాయి. భారత్‌ తన తొలి ఇన‍్నింగ్స్‌లో 13 సిక్సర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు బాధగా.. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు సాధించింది.

 రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌ పంచ్‌ను చూపించాడు. టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే వరుస రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. మరొకవైపు ఓపెనర్‌గా తొలి టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు. 1982-82 సీజన్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లెర్‌ వెసెల్స్‌ ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టులో 208 పరుగులు నమోదు చేశాడు. ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. అంతకుముందు విజయ్‌ హజారే, సునీల్‌ గావస్కర్‌ (మూడుసార్లు), రాహుల్‌ ద్రవిడ్‌ (రెండుసార్లు), విరాట్ కోహ్లీ (ఒకసారి), అంజిక్య రహానే (ఒకసారి) చేశారు.

 అత్యధిక సిక్సర్లు

అత్యధిక సిక్సర్లు

ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును రోహిత్‌ శర్మ లికించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో సిక్స్‌ సాధించి ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా మరో ఘనతను సాధించాడు. మూడు ఫార్మాట్లలో భారత్‌ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన ఘనత రోహిత్‌ పేరిట లిఖించబడింది. వన్డేల్లో 16 సిక్సర్లు, 10 సిక్సర్లు, టీ20ల్లో 10 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలో భారత్‌ నుంచి ఒక​ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు.

350 వికెట్లు

350 వికెట్లు

ఈ టెస్టులో డిబ్రుయిన్‌ (10)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేసాడు. ఈ వికెట్ తీయడంతో టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. మురళీధరన్‌ 66వ టెస్టులో 350 వికెట్లు తీయగా.. అశ్విన్‌ సైతం అన్నే టెస్టుల్లో 350 వికెట్లు సాధించాడు. దీంతో తక్కువ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డును అశ్విన్ సొంతం చేసుకున్నాడు.

Story first published: Sunday, October 6, 2019, 16:36 [IST]
Other articles published on Oct 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+