Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: భారత్‌ను ఓడించడానికి 100 రన్స్ చాలు - నోరు జారిన దక్షిణాఫ్రికా కెప్టెన్

కేప్ టౌన్‌లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. అంతేగాక సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 62 పరుగులకు మూడు వికెట్లు కూడా కోల్పోయింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ కంటే 36 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా ఉంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి 23.2 ఓవర్లలోనే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించగా, బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టాప్ స్కోరర్‌గా వెరీన్ (15) నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి (46) నిలిచాడు.

IND vs SA: 100 runs enough to beat India - South African captain Dean Elgar who slipped his mouth

అయితే భారత్‌పై 100 పరుగుల లక్ష్యంతో తాము విజయం సాధిస్తామని సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అతి విశ్వాసంతో వ్యాఖ్యలు చేశాడు. పిచ్ వైఖరి, తమ బౌలర్లపై ధీమాతో ఎల్గర్ మాట్లాడాడు. '' 100 పరుగుల టార్గెట్‌‌తో మేం గెలుస్తామని అనుకుంటున్నా. మౌ బౌలర్లు ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కూడా సవాలు చేయగలరు.ఈ పిచ్‌పై మాకు సాధ్యమవుతుంది''

''అయితే ఈ వికెట్ బౌలర్లకు ఇంతలా సహకరిస్తుందని ఊహించలేదు. చూస్తే మంచి వికెట్‌గా అనిపించింది. కానీ బరిలోకి దిగితే అసలు విషయం తెలుస్తుంది. టీమిండియా బౌలర్లు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశారు. మొదటి సెషన్ కొనసాగుతున్న కొద్ది పిచ్ వేగవంతమైనదిగా అనిపించింది'' అని అన్నాడు.

కాగా, తొలి రోజు ఆటలో 23 వికెట్లు పడిన సంగతి తెలిసిందే. టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం. అయితే 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టు స్కోరులో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది.

Story first published: Thursday, January 4, 2024, 14:04 [IST]
Other articles published on Jan 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+