సరిగా పాడలేదు: అమితాబ్‌పై ఢిల్లీలో కేసు నమోదు
కోల్‌కత్తా: జాతీయ గీతం సరిగా పాడలేదంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... ఐసీసీ వరల్డ్ టీ20 సందర్భంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం పాడిన సంగతి తెలిసిందే.
అయితే అమితాబ్ బచ్చన్ జాతీయగీతం సరిగా పాడలేదంటూ ఢిల్లీలోని ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉల్లాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నిర్ణీత సమయానికన్నా ఎక్కువసేపు అమితాబ్ జాతీయ గీతాన్ని ఆలపించారంటూ అతడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతక ముందు భారత్-పాక్ మ్యాచ్‌లో జాతీయ గీత ఆలాపన కార్యక్రమానికి హాజరైన బిగ్ బి రూ. 4 కోట్లు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్యాబ్ సీనియర్ అధికారి స్పందిస్తూ అమితాబ్‌కు తాము ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.
కాగా, టోర్నీలో భాగంగా మార్చి 19న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అమితాబ్ బచ్చన్ భారత జట్టు తరుపున జాతీయ గీతాన్ని ఆలపించగా, పాకిస్థాన్ జట్టు తరుపున ఆ దేశ క్లాసికల్ సింగర్ షఫాకత అమనత అలీ ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications