Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

IND vs PAK: దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ టీ20 గ్రూప్ దశ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత మహిళల జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏ దశలోనూ పట్టు సడలించని భారత్.. 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత స్పిన్ బౌలర్లు శ్రీ చరణి, ప్రేమా రావత్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ అద్భుతంగా రాణించారు. పాకిస్థాన్ ను వారి అత్యల్ప స్కోరైన కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?
మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారని.. పిచ్‌ను అంచనా వేసి బౌలింగ్ చేశారని ప్రశంసించారు. అలాగే జట్టు ప్రమాణాలను ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకోవాడం చాలా ముఖ్యమని.. రాబోయే మ్యాచ్‌లలోనూ ఇదే దూకుడును కొనసాగిస్తామని తెలిపారు.

IND vs PAK Women Asia Cup 2026 India Crushes Pakistan Harmanpreet Kaur Reaches Historic Milestone

హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డు
పాకిస్థాన్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెరీర్లో 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. పురుషులు, మహిళ క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోని తొలి క్రికెటర్ గా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా తన ప్రయాణంపై మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

IND vs PAK: రఫ్ఫాడించిన తెలుగు తేజం.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

Also Read

IND vs PAK: రఫ్ఫాడించిన తెలుగు తేజం.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

అదరగొట్టిన తెలుగు తేజం
ఈ మ్యాచ్ లో కేవలం 7 పరుగులకే 3 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించిన యువ స్పిన్నర్ శ్రీచరణీ.. తన విజయానికి బౌలింగ్ కోచ్ సలహాలే కారణమని పేర్కొన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేసి.. త్వరలోనే టీ20లలో 50 వికెట్ల మైలురాయిని అందుకోనున్నట్లు ఆమె ఉత్సాహం వ్యక్తం చేశారు

Story first published: Sunday, September 6, 2026, 10:21 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+