IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్-4 కీలక మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్‌లో ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించింది. దీని తర్వాత ఇరు జట్ల మధ్య పెద్ద వివాదం కూడా జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించేది సొంత జట్టులోని ఒక ఆటగాడేనని చర్చ జరుగుతోంది.
భారత జట్టును గెలిపించేది పాక్ ఆటగాడే..
ఆ ఆటగాడు మరెవరో కాదు.. పాక్ ఓపెనర్ సైమ్ ఆయుబే. పాక్ ఓపెనర్ సైమ్ ఆయుబ్ ఇప్పటివరకు ఒక్క రన్ కూడా చేయకపోవడం గమనార్హం. మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు. మూడు మ్యాచ్ లు ఆడిన సైమ్ ఆయుబ్ మూడింటిలోనూ డకౌట్ అయ్యాడు. యూఏఈ, భారత్, ఒమన్.. ఏ జట్టుపైనా సైమ్ ఆయుబ్ ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. బ్యాటర్‌గా సైమ్ ఆయుబ్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది.

సైమ్ ఆయుబ్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో నిరంతరం విఫలమవుతున్నాడు. దీనివల్ల పాకిస్తాన్ జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సూపర్-4 మ్యాచ్ లో కూడా సైమ్ ఆయుబ్ బ్యాట్ తో రాణించకపోతే భారత్ ముందు పాకిస్థాన్ కష్టాల్లోచిక్కుకునే అవకాశం ఉంది. సైమ్ ఆయుబ్ వల్ల పాకిస్తాన్ జట్టు ఓడిపోయే అవకాశం ఉంది. జట్టుకు మంచి ఆరంభం లభిస్తే.. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చే బ్యాటర్లు మంచి స్కోర్ సాధించగలరు.
బౌలింగ్‌లో అదరగొట్టిన సైమ్ ఆయుబ్
23 ఏళ్ల పాక్ ఓపెనర్ సైమ్ ఆయుబ్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. దుబాయ్, అబుదాబిలలోని స్లో పిచ్‌లు సైమ్ ఆయుబ్‌కు బాగా కలిసి వస్తున్నాయి.ఈ రోజు భారత్‌తో జరిగే కీలక మ్యాచ్ లో సైమ్ ఆయుబ్ ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.