Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: కుక్క తోక ఎప్పుడూ వంకరే.. నీచబుద్ధిని మరోసారి బయటపెట్టింది..

IND vs PAK: శనివారం(మే 10) రోజున భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది. రెండు దేశాలులు దీనిని అంగీకరించాయి. కానీ పాకిస్థాన్ తన దుష్ట ఉద్దేశాలను, నీచమైన చర్యలను మానుకోవడం లేదు.అంతకు ముందు పాకిస్థాన్ స్వయంగా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. కానీ కాల్పుల విమల్లోకి రాగానే మళ్లీ అలాంటి నీచమైన చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘించి జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌పై డ్రోన్ దాడి చేసింది. అక్కడ కూడా కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ శ్రీనగర్ పైనే కాకుండా రాజస్థాన్‌పై కూడా దాడి చేసింది. అయితే భారత వైమానిక రక్షణ మరోసారి పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టింది. శ్రీనగర్, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుజరాత్‌లోని కచ్‌లో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి. కచ్‌లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పాకిస్థాన్ చేసిన ఈ నీచమైన చర్య తర్వాత దేశ ఆగ్రహం తారా స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. పాక్ తీరుపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేపటికే పాకిస్థాన్ మరోసారి తమ నీచబుద్ధి బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్క తోక వంకర అనే సామెత వారికి సరిగ్గా సరిపోతుందని మండిపడ్డారు.

IND vs PAK Virender Sehwag and Dhawan Slam Pakistan for Violating Ceasefire Agreement

ఈ పరిస్థితిలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్‌ను విమర్శిస్తూ ఒక పోస్ట్ చేశారు. 'కుక్క తోక ఎప్పుడూ వంకరగా ఉంటుంది' అనే అర్థం వచ్చే హిందీ సామెతను సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. కుక్క తోకను ఎలా అయితే చక్కగా చేయలేమో అలాగే పాకిస్థాన్‌ను కూడా సరిచేయలేమని సెహ్వాగ్ విమర్శించాడు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పోస్ట్‌ను చాలా మంది స్వాగతించారు. పాకిస్థాన్ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ నెటిజన్ల కామెంట్లను భారతీయులు తిప్పికొడుతున్నారు. అంతర్జాతీయ వేదికపై దాడి చేయనని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మూడు గంటల్లోనే పాకిస్థాన్ దానిని బద్దలు కొట్టిందని.. అది దాని నిజస్వరూపాన్ని వెల్లడిస్తుందని కొందరు విమర్శించారు.

ఇదిలా ఉండగా, భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా పాకిస్తాన్ గురించి ట్వీట్ చేశాడు. శిఖర్ ధావన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. "ఈ చౌకబారు దేశం మరోసారి తన నీచబుద్ధిని ప్రపంచం మొత్తానికి చూపించింది." అని పేర్కొన్నాడు. కానీ ఈ పరిస్థితిని చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ సంఘటనలు పాకిస్థాన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందని, కానీ సైన్యం దానిని అంగీకరించలేదని, పాకిస్థాన్‌లో ఏకీకృత పరిపాలన లేదని, అక్కడ నియంత్రణ లేదని సూచిస్తున్నాయని చెబుతున్నారు.

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సిరీస్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఐపీఎల్ సిరీస్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.

Story first published: Sunday, May 11, 2025, 12:18 [IST]
Other articles published on May 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+