IND vs PAK: పాక్ జట్టులో గేమ్​ ఛేంజర్స్ ఉన్నారు.. గొప్పగా ఆడాలి: కోహ్లీ

దుబాయ్: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అదో థ్రిల్‌. దాయాదుల స‌మ‌రం ఓ సూప‌ర్ ఎన్‌కౌంట‌ర్‌లా ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ ప్రేక్ష‌కులు టీవీల‌కే హ‌త్తుకుపోతారు. ఇక మైదానంలో ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఆ మ‌జాయే వేరు. ఇప్ప‌టివ‌ర‌కు టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జ‌ట్లు అయిదు సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఆ ఐదు మ్యాచుల్లో టీమిండియాదే పైచేయి. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు ఓడిపోలేదు. ప‌వ‌ర్‌ఫుల్ షాట్ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించే ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే త‌న ఆధిప‌త్యాన్ని చాటింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా నిలిచిన భారత్.. మరోసారి ఆ రికార్డును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం విజయం సాధించేందుకు తహతహలాడుతోంది.

మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీమిండియా మ్యాచ్ కోసం పాక్ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై భారత సారథి విరాట్​ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్​ జట్టు బలంగా కనిపిస్తోందన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును ఈ మాత్రం తేలికగా తీసుకోకూడదన్నాడు. పాక్ జట్టులో గేమ్​ ఛేంజర్స్ ఉన్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 'పాకిస్థాన్​ జట్టు బలమైంది. పాక్ జట్టులో గేమ్​ ఛేంజర్స్​ ఉన్నారు. వారిపై గొప్ప ప్రదర్శన చేయాలి. టాప్​ ఆటగాళ్లతో గొప్పగా ఆడాలని భావిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.

ఈ మ్యాచ్​లో పాకిస్తాన్ తప్పక విజయం సాధిస్తుందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టీ20 ప్రపంచకప్​లో భారత్​తో జరగనున్న మ్యాచ్​ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్​ చరిత్రలో ఇప్పటివరకు టీమిండియాను పాక్ ఓడించలేదు. కానీ అది గతం. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నాం. అక్టోబరు 24న జరగనున్న మ్యాచ్​లో విజయం మాదే. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించాం. ఈ మ్యాచ్​లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోరని ఆశిస్తున్నా. టీమిండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నాం' అని​ బాబర్​​ అన్నాడు.

చివరగా భారత్-పాకిస్తాన్ జట్లు 2019 జూన్‌ 16న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం, ఈ సారి తలపడటం అది కూడా పొట్టి ప్రపంచకప్‌లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక చరిత్ర పరంగా చూస్తే.. ఇప్పటి వరకు భారత్-పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 ప్రపంచకప్‌లో కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడుసార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ చూస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 23, 2021, 22:58 [IST]
Other articles published on Oct 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X