Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఇండియా-పాక్ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఈ సుందరి ఎవరో తెలుసా?

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 23) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల్లో చాలా ఉత్సాహం నెలకొంది. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అభిమానులు ఆశించారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ ను సునాయాసంగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు తమ జట్టుకు మద్దతు ఇవ్వడానికి దుబాయ్ వచ్చారు. మ్యాచ్ సమయంలో స్టేడియంలో చాలా మంది ప్రముఖులు కూడా కనిపించారు. మ్యాచ్ సమయంలో ఓ అందమైన మిస్టరీ గర్ల్ కూడా కనిపించింది. ఆమె అందం అందరినీ వెర్రివాళ్లను చేసింది. ఆ అందమైన అమ్మాయి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ అమ్మాయి ఎవరో అని ఆరా తీస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఆమె పాకిస్థానీ అని అనుకుంటున్నారు. మరికొందరు ఆమె భారతీయురాలు అని అంటున్నారు. ఇప్పటివరకు ఆ మిస్టరీ అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. కానీ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత మాత్రం ఆమెకు అభిమానుల సంఖ్య మాత్రం కచ్చితంగా పెరిగిందనేది మాత్రం వాస్తవం.

IND vs PAK The Mystery Girl Who Captivated Both Indian and Pakistani Fans

82వ సెంచరీని సాధించిన విరాట్ కోహ్లీ
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత్ కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ తనను చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లీ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించి.. సెంచరీతో భారత్ గెలిచిన తర్వాతే డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వచ్చాడు. కోహ్లీ 111 బంతులలో తన అజేయ సెంచరీని సాధించాడు. కోహ్లీకి ఇది వన్డే కెరీర్ లో 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్ లో 82వ సెంచరీ. ఈ సెంచరీతో కోహ్లీ అనేక రికార్డులు సృష్టించాడు.

Story first published: Monday, February 24, 2025, 11:16 [IST]
Other articles published on Feb 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+