Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - సగం మ్యాచ్ గెలిచేసిన రోహిత్ సేన..!!

 IND vs PAK, T20 World Cup 2022: Pakistan batter Fakhar Zaman ruled out a head of clash with India

మెల్‌బోర్న్: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న బిగ్ డే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దీనికోసం రెండు జట్లూ సన్నద్ధం అయ్యాయి. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫైట్. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండట్లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రేక్షకులు ఎదురు చూస్తోన్నారు.

 పాకిస్తాన్‌కు బిగ్ షాక్..

పాకిస్తాన్‌కు బిగ్ షాక్..

మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్ జట్టు నుంచి తప్పుకొన్నాడు. గాయం వల్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్- టీమిండియాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. నిజానికి- ఫకర్ జమాన్ ఇదివరకే గాయపడ్డాడు. వామప్స్‌లోనూ పెద్దగా కనిపించలేదు. భారత్‌తో మ్యాచ్ నాటికి కోలుకుంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆశించినప్పటికీ- వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.

కోలుకోలేని ఫకర్..

కోలుకోలేని ఫకర్..

ఫకర్ జమాన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. భారత్‌తో మ్యాచ్‌కు ఈ హార్డ్-హిట్టింగ్ బ్యాటర్ ఆడట్లేదని పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ ఏడాది ఆగస్టులో ముగిసిన ఆసియా కప్ 2022లో మ్యాచ్ ఆడుతూ ఫకర్ జమాన్ గాయపడ్డ విషయం తెలిసిందే. కుడి మోకాలికి గాయమైంది. అప్పటి నుంచీ క్రికెట్‌కు దూరంగా ఉంటోన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ నాటికి కోలుకుంటాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ భావించినప్పటికీ.. అలా జరగలేదు.

లో ఫిట్‌నెస్..

లో ఫిట్‌నెస్..

ఫకర్ జమాన్ 100 శాతం ఫిట్‌‌నెస్‌తో లేడని పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ కూడా స్పష్టం చేశారు. అతను ఇంకా కోలుకోలేదని, టీమిండియాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండబోడటంటూ చెప్పాడు. అతని స్థానంలో షాన్ మసూద్‌తో కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఫకర్ ఆడుతాడని వివరించాడు. షాన్ మసూద్ పూర్తి ఫిట్‌‌నెస్‌తో ఉన్నాడని, అదే స్థాయిలో సత్తా చాటుతాడని ఆశిస్తున్నట్లు బాబర్ ఆజమ్ తెలిపాడు.

 చోటు దక్కించుకున్నా..

చోటు దక్కించుకున్నా..

ఆసియా కప్ తర్వాత ఫకర్ జమాన్ గాయపడ్డాడు. ఫలితంగా- ప్రపంచ కప్‌ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎంపిక చేసిన తొలి 15 మంది ఆటగాళ్లలో అతనికి చోటు దక్కలేదు. ఈ నెల 14వ తేదీన బోర్డు కొన్ని కీలక మార్పులు చేసింది. ఫకర్‌ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసింది. అనంతరం అతను నేరుగా ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే గాయంతో భారత్‌తో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.

Story first published: Sunday, October 23, 2022, 11:24 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+