Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పంత్ ఒక్కడే.. బ్యాట్లెత్తేసిన భారత ప్లేయర్లు

పాకిస్థాన్‌తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) రాణించడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. న్యూయార్క్ వేదికగా మందకొడి పిచ్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పేలవారంభం దక్కింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు. నసీమ్ షా బౌలింగ్‌లో కోహ్లి, అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ ఫీల్డర్ల వైపు షాట్‌కు యత్నించి ఔటయ్యారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ (20; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అక్షర్ దూకుడుగా ఆడటం, పంత్‌కు అదృష్టం కలిసి రావడంతో భారత్ పవర్‌ప్లేలో 50 పరుగులు సాధించింది.

pant

అయితే కుదురుకున్న అక్షర్‌ పటేల్‌ను నసీమ్ షా బౌల్ట్ చేసి దెబ్బకొట్టాడు. మరోఎండ్‌లో ఉన్న పంత్ గేర్ మార్చడంతో భారత్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. ఎన్నో లైఫ్‌లు లభించిన అనంతరం పంత్ బౌండరీలతో హోరెత్తించాడు. దీంతో పది ఓవర్లలో టీమిండియా 81/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. క్రీజులో పంత్‌తో పాటు సూర్య ఉండటంతో భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయంగా అనిపించింది.

కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో 96 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ (7; 8 బంతుల్లో, 1 ఫోర్), శివమ్ దూబె (3; 9 బంతుల్లో), పంత్, రవీంద్ర జడేజా (గోల్డెన్ డకౌట్) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్షదీప్ సింగ్ (9; 13 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి హార్దిక్ స్కోరుబోర్డు ముందుకు నడిపించడానికి ప్రయత్నించారు. కానీ పాక్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.ఆఖర్లో సిరాజ్ (7 నాటౌట్; 6 బంతుల్లో)- అర్షదీప్ కష్టంతో భారత్ 119 పరుగులు సాధించింది.

Story first published: Sunday, June 9, 2024, 23:18 [IST]
Other articles published on Jun 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+