IND vs PAK: దంచికొట్టిన పాక్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
IND vs PAK: ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరుగుతోంది. జాంబియా రాజధాని అయిన లుసాకాలోని లోట్లే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. పాకిస్థాన్ పాంథర్స్ జట్టు బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. పాకిస్థాన్ పాంథర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో ఇండియన్ రాయల్స్ జట్టు ముందు 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ 29 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బ్యాటర్లలో వరుసగా యాసిర్ భట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇమ్రాన్ నజీర్ 47 పరుగులు చేసి ఔటైన అనంతరం.. ఇబ్రార్ హుస్సేన్ 39, తౌఫిక్ ఉమర్ 39, యాసిర్ షా(10), రాణా అన్వర్(0), హసన్ రజా 2, హంజా అలీ 8 పరుగులు చేశారు. దీంతో పాక్ జట్టు 167 పరుగులకు చేరుకోగలిగింది. భారత బౌలర్లలో సుబోధ్ భాటి, షాదాబ్ జకాటి తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మన్ ప్రీత్ గోని, రిషి ధావన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

