Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌లో ఈ రోజు టెలివిజన్లకు మూడినట్టే.. సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్

Ind vs Pak: Memes ruling in social media

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో ఓ వైపు భారత, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. మరో వైపు ఈ మ్యాచ్‌పై ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మీమ్స్ సంచలనం రేపుతున్నాయి. మ్యాచ్ జరుగుతుండగానే పాక్ ఓటమి పాలైతే ఇక ఆ దేశంలో టెలివిజన్లకు మూడినట్టే అనే విధంగా మీమ్స్ రూపొందించి నెటిజన్లు పండుగ చేసుకొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ మీకోసం..

పాకిస్థాన్ ఓటమిపాలైతే

పాకిస్థాన్ ఓటమిపాలైతే

భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి చెందిన ప్రతీసారి ఆ దేశపు క్రికెట్ అభిమానులు టెలివిజన్లు పగులు కొట్టిన సందర్భాలు కోకోల్లలు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పాకిస్థాన్‌లో టీవీలకు ప్రొటెక్షన్ ఇలా అంటూ ఓ మీమ్‌ను పోస్టు చేశారు.

టీవీ మెకానిక్‌లకు పండుగే...

టీవీ మెకానిక్‌లకు పండుగే...

పాకిస్థాన్ ఓడిపోతే ఆ దేశంలో టీవీ రిపేర్ చేసే మెకానిక్‌లకు పండుగే అంటూ ఓ మీమ్‌ను పోస్టు చేశారు. బాలీవుడ్ చిత్రం హెరా పెరీ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేశ్ రావెల్, సునీల్ శెట్టి ఫొటోను పెట్టి.. టీవీ రిపేర్లకు డబ్బులే డబ్బులు అంటూ కామెంట్ పెట్టాడు.

డేంజర్ జోన్‌లోకి అమీర్ వెళ్లడంపై

డేంజర్ జోన్‌లోకి అమీర్ వెళ్లడంపై

తాజా పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌లో బౌలర్ మహ్మద్ అమీర్ పదే పదే పిచ్ పై డేంజర్ జోన్‌లోకి రావడంతో పలు మార్లు అంపైర్ హెచ్చరించారు. డేంజర్ జోన్‌లో అడుగేస్తే మ్యాచ్ నుంచి బయటకు పంపిస్తాను అని హెచ్చరించాడు.

ఏ లైన్‌లోకి వెళ్తున్నావ్ భయ్యా అని

ఏ లైన్‌లోకి వెళ్తున్నావ్ భయ్యా అని

పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ డేంజర్ జోన్‌లో అడుగు వేయడంపై కూడా మీమ్స్ వచ్చాయి. అమీర్‌ను ఉద్దేశించి.. అన్నయ్య.. మీరు ఏ లైన్‌లోకి వస్తున్నారు. (బాయ్‌సాబ్, యే కిస్ లైన్ మే ఆ గయా ఆప్) అంటూ అక్షయ్ కుమార్ ఫొటోతో మీమ్ పోస్టు చేశారు.

 గన్స్‌తో వికెట్లు పడగొట్టాలనే ప్రయత్నం

గన్స్‌తో వికెట్లు పడగొట్టాలనే ప్రయత్నం

భారత బ్యాటింగ్ జోరుకు పాక్ బౌలర్లు బెంబేలెత్తుతున్నారు. ఇక వాళ్లు బాల్స్‌తో కాకుండా గన్స్ గురిచూసి వికెట్లను పడగొట్టాలని అనుకొంటున్నారు.

పాక్ టాస్ గెలిచి బౌలింగా?

పాక్ టాస్ గెలిచి బౌలింగా?

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఆహ్మద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై కూడా నెటిజన్లు సెటైర్లు విసిరారు. ధోని, కోహ్లీ, సర్ఫరాజ్ ఫొటో పెట్టి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొందాం అని కోహ్లీతో ధోని అన్నట్టు.. అది విని సర్ఫరాజ్ కూడా అదే నిర్ణయం తీసుకొన్నాడనే విధంగా సెటైర్ వేశారు.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 19:35 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+