IND vs PAK: ఆ టీమిండియా బ్యాట‌ర్‌తో పాకిస్థాన్‌కు ప్రమాదమే: హేడెన్

Ind vs Pak : Team India లో ఆ ఓపెన‌ర్ ఉంటే Pak కి దబిడిదిబిడే..! || Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టీ20 మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, పాకిస్థాన్ జ‌ట్టు బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌ మాథ్యూ హేడెన్ కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. భారత జ‌ట్టులోని ఓ బ్యాట‌ర్ వ‌ల్ల పాకిస్థాన్‌కు పెను ప్ర‌మాదం ఉంద‌ని హేడెన్ అంచ‌నా వేశాడు. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌తో పాకిస్థాన్‌కు కష్టమే అని పేర్కొన్నాడు. రాహుల్ గత కొంతకాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020, 2021 సహా భారత జట్టులో కూడా అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

నాయకత్వమే కీలక పాత్ర

నాయకత్వమే కీలక పాత్ర

తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ ... 'భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే పోటీలో నాయకత్వమే కీలక పాత్ర పోచించనుంది. ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్‌లు అద్భుత‌మైన నాయ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే.. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్ ఫైన‌ల్‌కు చేరుకున్నాయి. నిజానికి వ్య‌క్తిగ‌తంగా ఆ ఇద్ద‌రి ప‌ర్ఫార్మెన్స్ స‌రిగా లేదు. కానీ త‌మ జ‌ట్ల‌ను వాళ్లు న‌డిపించిన విధానం అద్భుతం. పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ చాలా నైపుణ్య‌మైన కెప్టెన్సీని ప్ర‌ద‌ర్శిస్తే.. పాకిస్తాన్ జ‌ట్టుకు విజ‌యం సాధించడం సులువే' అని ఉదహరించాడు.

పాకిస్థాన్‌కు ప్ర‌మాదమే

పాకిస్థాన్‌కు ప్ర‌మాదమే

'కెప్టెన్ మరియు బ్యాట్స్‌మన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్‌పై అదనపు ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అతను టీమిండియాతో జరిగే మ్యాచులో కచ్చితంగా టార్గెట్ చేయబడతాడు. కెప్టెన్ మరియు బ్యాట్స్‌మన్‌గా రాణించాలని అందరూకోరుకుంటారు' అని మాథ్యూ హేడెన్ చెప్పాడు. 'భారత ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ చాలా కీల‌క‌మైన ఆట‌గాడు.

చిన్న‌తనం నుంచి రాహుల్ క్రికెట్ ఆడుతున్న వైనాన్ని గ‌మ‌నించా. షార్ట్ ఫార్మాట్‌లో అత‌ని ఆధిపత్యం అమోఘం. రాహుల్ వ‌ల్ల పాకిస్థాన్‌కు ప్ర‌మాదం ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా కీల‌క‌మే. బలమైన బౌలింగ్ అటాక్‌ను కూడా పంత్ చిత్తు చేస్తాడు. రాహుల్‌, పంత్‌ల‌ను క‌ట్ట‌డి చేస్తే పాకిస్థాన్‌కు విజ‌యం ద‌క్కుతుంది' అని పాకిస్థాన్ జ‌ట్టు బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌ పేర్కొన్నాడు.

IND Vs PAK: మాలిక్, హఫీజ్‌లకు ఛాన్స్.. అలీలకు దక్కని చోటు! భారత్‌తో తలపడే పాకిస్తాన్ జట్టు ఇదే!!

తిరుగులేని విజయాలు

తిరుగులేని విజయాలు

ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్ మ్యాచులలోనూ పాకిస్తాన్‌పై భారత్ తిరుగులేని విజయాలు సాధించింది. ఈ నెల 24న జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లోనే గత సంప్రదాయాలను బట్టి చూస్తే మరోసారి పాక్‌పై భారత్ తిరుగులేని విజయం సాధిస్తుందని అంటున్నారు. 2007లో జరిగిన తొలి ప్రపంచకప్ టీ20 టోర్నీలో భారత్ గెలిచింది. మ్యాచ్ టై అయ్యింది.

అయితే బౌల్‌ అవుట్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. ఇక ఫైనల్లో దాయాది జట్టుపైనే గెలిచిన భారత్ టైటిల్ గెలుచుకుంది. ఆపై కూడా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఇక ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ దుబాయ్ వేదికగా ఆరోసారి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో తలపడబోతోంది.

ఐసీసీ టోర్నీల్లోనే

ఐసీసీ టోర్నీల్లోనే

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో పాక్ పరాజయం పాలయ్యింది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 21, 2021, 18:46 [IST]
Other articles published on Oct 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X