For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: మదర్ ఆఫ్ ఆల్ మ్యాచెస్ - బకెట్లు పట్టుకొస్తాం

IND vs PAK: India-Pakistan matches are the mother of all matches, says Comedian Momin Saqib

మెల్‌బోర్న్: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న బిగ్ డే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దీనికోసం రెండు జట్లూ సన్నద్ధం అయ్యాయి. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫైట్. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండట్లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రేక్షకులు ఎదురు చూస్తోన్నారు.

లక్ష టికెట్లు..

లక్ష టికెట్లు..

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులకు వీక్షించడానికి సన్నద్ధం అయ్యారు. ఇదో రికార్డు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తి సామర్థ్యం లక్ష. లక్ష మంది ఒకేసారి మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇదివరకు చాలా అరుదుగా మాత్రమే ఈ స్థాయిలో మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిండింది.

 అందరి దృష్టీ అటే..

అందరి దృష్టీ అటే..

సుమారు రెండు నెలల వ్యవధిలో భారత్-పాకిస్తాన్ తలపడబోతోండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తోన్నారు. ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందనే విషయంపై జోస్యాలు చెబుతోన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- ఈ టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఛాంపియన్‌గా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆవిర్భవిస్తుందంటూ ఇదివరకే మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా చెప్పుకొచ్చారు.

కమేడియన్ టాప్ కామెంట్స్..

కమేడియన్ టాప్ కామెంట్స్..

ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ టాప్ కమేడియన్ మోమిన్ సాకిబ్- ఈ మ్యాచ్‌పై హిలేరియస్ కామెంట్స్ చేశారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అన్ని మ్యాచ్‌లకూ తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. మ్యాచ్ చూడ్డానికి ఆయన మెల్‌బోర్న్ చేరుకున్నారు. ఎంసీజీ బయట వద్ద విలేకరులతో మాట్లాడారు. చాలా దూరం ప్రయాణించి ఆస్ట్రేలియాకు చేరుకున్నానని, దీనికి కారణం- ఈ మ్యాచ్‌పై ఉన్న అంచనాలేనని, ప్రస్తుతం అందరి దృష్టీ దీని మీదే ఉందని, దీనికి ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండదని చెప్పారు.

బకెట్లతో నీళ్లు ఎత్తేస్తాం..

బకెట్లతో నీళ్లు ఎత్తేస్తాం..

మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ఆందోళన అభిమానుల్లో కనిపించిందని, ఇప్పుడా పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. వర్షం పడితే బకెట్లతో నీళ్లను ఎత్తిపోస్తామని పేర్కొన్నారు. మేఘాల చాటు నుంచి సూర్యుడు బయటికొచ్చాడని, వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని, ఒకవేళ వర్షమే వస్తే- గ్రౌండ్‌లో నుంచి బకెట్లతో నీళ్లను ఎత్తిపారేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ చెప్పుకొచ్చాడు మోమిన్ సాకిబ్. వర్షం పడటానికి ఏ మాత్రం అవకాశం లేదని అన్నారు.

Story first published: Sunday, October 23, 2022, 10:34 [IST]
Other articles published on Oct 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+