Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ఆ క్రేజ్ మాత్రం తగ్గదు. అది అంతర్జాతీయ క్రికెట్ అయినా, దిగ్గజ ఆటగాళ్ల లీగ్ అయినా, ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా లక్షలాది మంది అభిమానులు మంత్రముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఆసియన్ లెజెండ్స్ లీగ్ 2026లో మరోసారి జరిగింది. ఇక్కడ ఇరు దేశాల మాజీ స్టార్ ప్లేయర్లు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఇండియన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాంబియాలో జరుగుతున్న ఆసియన్ లెజెండ్స్ లీగ్ ఆరో మ్యాచ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు పాకిస్తాన్ పాంథర్స్‌ను ఎదుర్కొంది. భారత జట్టు కెప్టెన్ నమన్ ఓఝా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పాకిస్తాన్ తరఫున కెప్టెన్ ఇమ్రాన్ నజీర్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇండియన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి మ్యాచ్ గెలుచుకుంది.

IND vs PAK: దంచికొట్టిన పాక్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!

IND vs PAK: దంచికొట్టిన పాక్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!

ఆసియన్ లెజెండ్స్ లీగ్ 2026లో జరిగిన ఈ రెండో లీగ్ మ్యాచ్‌లోరిషి ధావన్ అద్భుతమైన అర్ధ సెంచరీతో రాణించడంతో ఇండియన్ రాయల్స్ జట్టు పాకిస్థాన్ పాంథర్స్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ లీగ్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండవ విజయం. చివరి నిమిషంలో పాకిస్థాన్ త్వరగా కొన్ని వికెట్లు తీసినప్పటికీ, అనురీత్ సింగ్ అజేయంగా చేసిన 16 పరుగులు భారత్‌కు విజయాన్ని అందించాయి. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ నమన్ ఓఝా బ్యాటింగ్ అంతగా రాణించలేదు. నమన్ ఓఝా 4 బంతుల్లో 4 పరుగులు చేసి మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్ జటోలా మంచి ఫామ్‌లో కనిపించాడు. అభిషేక్ జటోలా 21 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 పరుగులు చేసినప్పటికీ.. తన ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మార్చలేక మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

IND vs PAK India Beats Pakistan by 2 Wickets in Asian Legends League 2026 Thriller Rishi Dhawan Shines

రిషి ధావన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, 33 బంతుల్లో 50 పరుగులకు ఔటయ్యాడు. సరుల్ 29 బంతుల్లో 46 పరుగులకు ఔటయ్యాడు. ఫర్మాన్ అహ్మద్ సున్నా పరుగులకే ఔటవ్వగా.. షాదాబ్ 4 పరుగులకు ఔటయ్యాడు. అనురీత్ సింగ్ 6 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ తరఫున మహమ్మద్ ఇర్ఫాన్, అలీ రహత్, యాసిర్ షా తలా రెండు వికెట్లు తీయగా.. రాణా అన్వర్, ఇమ్రాన్ నజీర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇమ్రాన్ నజీర్ 47 పరుగుల ఇన్నింగ్స్.
పాకిస్థాన్ తరఫున ఇమ్రాన్ నజీర్, యాసిర్ భట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. యాసిర్ భట్ 6 పరుగులు చేసి మ్యాచ్ ప్రారంభంలోనే మన్‌ప్రీత్ గోనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ ఇమ్రాన్ నజీర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, అర్ధశతకాన్ని అందుకోలేకపోయాడు. ఇమ్రాన్ 29 బంతుల్లో 47 పరుగులు చేయగా.. అతని వికెట్‌ను సుబోధ్ భాటి పడగొట్టాడు. తౌఫిక్ ఉమర్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేసి, ఒక సిక్స్, 6 ఫోర్ల సహాయంతో 27 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇబ్రార్ హుస్సేన్ కూడా బాగా బ్యాటింగ్ చేసి, రెండు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు. రాణా అన్వర్ ఖాతా తెరవడంలో విఫలమై, షాదాబ్ జకాటి బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. యాసిర్ షా 12 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. హసన్ రజా రెండు పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. హమ్జా అలీ మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

IND vs SL: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ ఫిట్‌నెస్ క్లియర్?

Also Read

IND vs SL: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్ ఫిట్‌నెస్ క్లియర్?

సుబోధ్ భాటి, షాదాబ్ జకాటి చెరో 2 వికెట్లు
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున బౌలింగ్ చేసిన సుబోధ్ భాటి 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. షాదాబ్ జకాటి కూడా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మన్‌ప్రీత్ గోనీ 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. రిషి ధావన్ కూడా 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అనురీత్ సింగ్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చినా, ఒక్క వికెట్ కూడా తీయలేదు.

ఇండియన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్: నమన్ ఓజా (కెప్టెన్), రిషి ధావన్, షాదాబ్ జకాటి, ఫర్మాన్ అహ్మద్, అభిషేక్ జలోటా, వీర్ ప్రతాప్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్, అసద్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ, సుబోధ్ భాటి.

పాకిస్థాన్ పాంథర్స్ ప్లేయింగ్ ఎలెవన్: యాసిర్ షా, అలీ రహత్, మహ్మద్ ఇర్ఫాన్, ఇమ్రాన్ నజీర్ (కెప్టెన్), హసన్ రజా, యాసిర్ భట్, మహ్మద్ జాహిద్, తౌఫీక్ ఉమర్, రాణా నసీర్ అన్వర్, హమ్జా అలీ, ఇబ్రార్ హుస్సేన్.

Story first published: Sunday, August 2, 2026, 20:47 [IST]
Other articles published on Aug 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+