IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌.. బరిలోకి దిగే జట్లు ఇవే! పటిష్టంగా కోహ్లీసేన!!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021 ఈరోజు (అక్టోబర్ 23) ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడననున్నాయి. ఇక ఈ మెగా టోర్నిలో ఆదివారం హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్‌-2లో భారత్, పాకిస్థాన్ జట్లు త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ హై వోల్టేజీ మ్యాచ్ కోసం పాకిస్థాన్ త‌మ జ‌ట్టును తాజాగా ప్ర‌క‌టించింది. బాబ‌ర్ ఆజ‌మ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జ‌ట్టు.. కోహ్లీసేన‌తో ఢీకొట్ట‌నున్న‌ది. పాక్ జ‌ట్టులో ఆడే ఆట‌గాళ్ల లిస్టును రిలీజ్ చేశారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జ‌ట్టులో చోటుద‌క్కిన వారిలో మొహ్మద్ రిజ్వాన్‌, ఫ‌క‌ర్‌ జామన్, మొహ్మద్ హ‌ఫీజ్‌, షోయబ్ మాలిక్‌, మొహ్మద్ ఆసిఫ్‌, ఇమాద్‌ వసీమ్, షాదాబ్‌ ఖాన్, హ‌స‌న్‌ అలీ, షాహీన్‌షా ఆఫ్రిదిలు ఉన్నారు.

గ‌తంలో పాకిస్థాన్ ఓసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న‌ది. 2009లో పాకిస్తాన్ జ‌ట్టు క‌ప్‌ను సొంతం చేసుకున్న‌ది. ఇక ఈసారి ఆ టీమ్ త‌న తొలి మ్యాచ్‌లోనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి, దాయాది భార‌త్‌తో పోటీప‌డుతోంది. బాబ‌ర్ ఆజ‌మ్‌, ఆసిఫ్ అలీ, ఫ‌క‌ర్ జ‌మాన్‌, హైద‌ర్ అలీలు ప్ర‌ధాన బ్యాట‌ర్లుగా బ‌రిలోకి దిగుతున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో ఇమాద్‌, హ‌ఫీజ్‌, షోయబ్, షాదాబ్‌లు ఉన్నారు. రిజ్వాన్‌కు కీపింగ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్నారు. ఇక ప్ర‌ధాన బౌల‌ర్లుగా హ‌రిస్ రౌఫ్‌, హ‌స‌న్ అలీ, షాహీన్ షా అఫ్రిదీలు ఉంటారు. షాహీన్‌ 12వ స్థానంలో ఉన్నాడు. మొత్తానికి పాక్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్‌పను ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు. ఇటీవలె ముగిసిన ఐపీఎల్‌తో ఆటగాళ్లంతా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. రోహిత్‌, విరాట్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రాలాంటి మ్యాచ్‌ విన్నర్లతో ఊపు మీద కనిపిస్తోంది. 2016 మెగా టోర్నీ తర్వాత భారత్‌ ఈ ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లాడింది. 65.3 విజయాల శాతంతో 47 గెలుపులు, 22 ఓటములతో మెరుగ్గానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచక్‌పలోనూ ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది. అదీగాకుండా కోహ్లీ ఆధ్వర్యంలో భారత జట్టు చివరి టీ20 టోర్నీ ఆడబోతోంది. ధోనీ సైతం మరో టైటిల్ అందించాలనే ఆశతో ఉన్నాడు. ఈ కప్‌ను ఈ ఇద్దరికి కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో సహచర ఆటగాళ్లున్నారు.

టీమిండియాతో సమరానికి పాకిస్తాన్ జట్టు 12 మందితో తుది జట్టును ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక భారత్ కూడా దాదాపుగా ప్లేయింగ్ 11ను సిద్ధం చేసింది. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఐపీఎల్ 2021లో రాణించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. రాహుల్ చహర్‌కు చోటు కష్టంగానే ఉంది.

తుది జట్లు ఇవే:
పాకిస్తాన్: బాబర్ అజమ్ (కెప్టెన్) , ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మొహ్మద్ రిజ్వాన్, వసీమ్, హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయాబ్ మాలిక్, హరిస్, హసన్ అలీ, షాహెన్ షా ఆఫ్రిది,
భారత్:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, సూర్యకుమార్ కుమార్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 23, 2021, 17:09 [IST]
Other articles published on Oct 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X