Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరి కాన్సన్‌ట్రేషన్ రోహిత్ శర్మ మీదే : ఆ మేజిక్ రిపీట్..!!

IND vs PAK: I am excited, this is my first T20 World Cup as a captain, says Rohit Sharma

మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. ఇవ్వాళ రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఇందులో ఒకటి ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. తొలి మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా మారింది. శ్రీలంకతో నమీబియా తలపడబోతోంది తొలి రౌండ్ మ్యాచ్‌లో. మధ్యాహ్నం 1:30కు రెండో మ్యాచ్ ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-నెదర్లాండ్స్ పోటీ పడనున్నాయి.

భారత్- పాక్ మధ్య..

భారత్- పాక్ మధ్య..

వచ్చే ఆదివారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన ఆదివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్‌లో బ్లాక్ క్యాప్స్‌ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.

తొలి టీ20 ప్రపంచకప్

తొలి టీ20 ప్రపంచకప్

టీమిండియాకు కేప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి టీ20 ప్రపంచకప్. ఇదివరకు ప్లేయర్‌గా మాత్రమే తన పాత్రను నిర్వర్తించాడు హిట్ మ్యాన్. ఇప్పుడు జట్టు సారథిగా ఆవిర్భవించాడు. అతని నాయకత్వంలో టీమిండియా ఈ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022లో ఏ స్థాయిలో రాణిస్తుందనే దానిమీదే అందరి దృష్టీ నిలిచింది.

ధోనీ కేప్టెన్సీలో..

ధోనీ కేప్టెన్సీలో..

2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. టీ20 ఫార్మట్‌లో ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా అవతరించింది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఆ కప్‌ను ముద్దాడలేదు భారత్. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లగలిగిందంతే. ఇది ఎనిమిదో టోర్నమెంట్. ఈ సారి ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా..

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టును అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అదే స్థాయిలో జాతీయ జట్టును నడిపించలేకపోతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేస్తోన్నప్పటికీ.. ఇలాంటి మేజర్ టోర్నమెంట్లల్లో విఫలమౌతోన్నాడు రోహిత్ శర్మ. దీనికి నిదర్శనమే ఆసియాకప్ 2022. ఈ టోర్నమెంట్‌లో మలి దశలో అడుగు పెట్టలేకపోయింది టీమిండియా అతని కేప్టెన్సీలో.

Story first published: Sunday, October 16, 2022, 9:21 [IST]
Other articles published on Oct 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+