Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎప్పుడు, ఎలా చుడొచ్చో తెలుసా? వారికి పండగే!!

Ind vs Pak: How To Watch India vs Pakistan T20 World Match On Hotstar And Star sports

హైదరాబాద్: సూపర్ సండేకు సమయం దగ్గరపడుతోంది. దాయాదుల పోరు కోసం యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా రేపు (అక్టోబర్ 24) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత దాయాది దేశాలు రెండూ మళ్లీ తలబడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫాన్స్ ఎగబడిన విషయం తెలిసిందే. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లను ఐసీసీ ఆన్‌లైన్‌లో ఉంచగా కేవలం ఒక గంట వ్యవధిలో మ్యాచ్ టికెట్స్ అయిపోయాయి.

ఎలా చుడొచ్చో తెలుసా:

ఎలా చుడొచ్చో తెలుసా:

క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఓ యుద్ధం లాంటిది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగిందంటే.. ఫ్యాన్స్ ఓ యుద్ధం జరిగినట్లుగా ఫీల్ అవుతారు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. ప్రతీ నిమిషానికి మారే సమీకరణాలు.. ఎవరి మీద ఎవరు పైచేయి సాధిస్తారు.. ఇలా అంతా కూడా టెన్షన్. మ్యాచ్ క్లైమాక్స్‌కు చేరే వరకు ప్రతీ మూమెంట్‌ ఎమోషనల్‌ మారనుంది. అలాంటి మ్యాచ్ ఎలా చూడాలంటే. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దేశంలోని అన్ని భాషల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. హాట్‌స్టార్ యాప్‌ ఉన్న అభిమానులకు ఓరకంగా పండగే అని చెప్పాలి. దుబాయ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది.

ఐదు మ్యాచ్‌లలో టీమిండియానే:

ఐదు మ్యాచ్‌లలో టీమిండియానే:

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌లలో టీమిండియానే గెలిచింది. 2007 ప్రపంచకప్‌ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం 2016 ప్రపంచకప్ వరకు కొనసాగింది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అటు రోహిత్ శర్మ కూడా పాక్‌పై అదరగొట్టాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో రేపు జరిగే మ్యాచ్‌కు టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ XI ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు బరిలోకి దిగనున్నారు. ఒకవేళ ఈ పదకొండు మంది ప్లేయర్స్ బరిలోకి దిగితే.. పాకిస్తాన్‌కు చుక్కలే అని నెటిజన్లు అంటున్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహా:

ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహా:

గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది.

జట్లు:

జట్లు:

భారత్ ప్లేయింగ్ XI: (అంచనా): విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మొహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ షా ఆఫ్రిది, హారిస్ రౌఫ్.

Story first published: Saturday, October 23, 2021, 19:06 [IST]
Other articles published on Oct 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+