For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క ఓవరే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

IND vs PAK: పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మహాసంగ్రామంలో ఒకానొక సమయంలో టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు పాకిస్తాన్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ తిలక్ వర్మ, శివమ్ దూబే క్రీజులో ఉండగా.. ఆ ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ కథను పూర్తిగా మార్చేసింది.

పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేసిన తర్వాత టీమిండియాకు విజయం తేలికే అనిపించింది. కానీ రెండో ఓవర్లోనే అభిషేక్ శర్మ ఔట్ కాగా.. ఆ తర్వాత పవర్ ప్లే ముగిసే లోపే సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వికెట్లు కూడా పడిపోయాయి. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టుకు విజయం ఖాయమనే ధీమా వచ్చింది. ఆ తర్వాత తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు.

IND vs PAK Final Turning Point How Haris Rauf 15th Over Changed the Asia Cup 2025 Final

14 ఓవర్ల తర్వాత కేవలం 83 పరుగులు
తిలక్ వర్మ, సంజూ శాంసన్ మధ్య అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. 13వ ఓవర్లో రన్ రేట్ పెంచే ప్రయత్నంలో సంజూ శాంసన్(21 బంతుల్లో 24) ఔటయ్యాడు. 14వ ఓవర్ ముగిసేసరికి భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు కావడం గమనార్హం. రన్ రేట్ 6 కంటే కూడా తక్కువగా ఉంది. చివరి 36 బంతుల్లో భారత్ 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. పిచ్, పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ లక్ష్యం చాలా కష్టంగా అనిపించింది.

హారిస్ రౌఫ్ వేసిన ఓవరే మ్యాచ్ టర్నింగ్ పాయింట్
టర్నింగ్ పాయింట్ సరిగ్గా 15వ ఓవర్లో వచ్చింది. పాకిస్తాన్ తరఫున ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ ఈ ఓవర్ ను వేశాడు. శివమ్ దూబే ఫోర్‌తో ఓవర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత మూడో బంతికి తిలక్ వర్మ ఒక ఫోర్ కొట్టాడు. అప్పటికే 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతిని తిలక్ వర్మ సిక్స్ గా మలిచాడు. ఈ ఒక్క ఓవర్లో 17 పరుగులు రావడంతో మ్యాచ్ సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. 36 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిన భారత్ ముందు అప్పటి నుంచి 30 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన టార్గెట్ మిగిలింది.

22 బంతుల్లోనే 50 పరుగులు సమర్పించుకున్న రౌఫ్
హారిస్ రౌఫ్ ఆసియా కప్ 2025 ఫైనల్లో అత్యంత ఖరీదైన బౌలర్ గా నిలిచాడు. అతడు 3.4 ఓవర్లలో 13.6 ఎకానమీతో ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ బౌలర్లందరూ కలిసి 16 ఓవర్లలో 100 పరుగులు ఖర్చు చేయగా.. హారిస్ రౌఫ్ ఒక్కడే 22 బంతుల్లో 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణమైంది. రౌఫ్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి కూడా సిక్స్ పోయింది. చివరకు చివరి ఓవర్‌లో తిలక్ వర్మ రెండో బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.

Story first published: Monday, September 29, 2025, 9:35 [IST]
Other articles published on Sep 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+