
భారత్ అజేయ రికార్డుకు బ్రేక్
2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్‌లోనే కాదు.. వన్డే ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకూ భారత్‌ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్థాన్ ఓడించలేకపోయింది. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే పాక్ గెలిచింది. మొత్తంగా ప్రపంచకప్‌లో పాక్‌పై 12-0తో అజేయ రికార్డ్‌ని టీమిండియా ఆదివారం వరకు కొనసాగించగా.. బాబర్ అజామ్ ఆ రికార్డుకు బ్రేక్ వేశాడు.

మరో 13 బంతులు మిగిలి ఉండగానే
దుబాయ్‌లో ఆదివారం రాత్రి భారత్‌పై పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలవడం కూడా పాక్‌కి కలిసిరాగా.. పేసర్లతో పాటు స్పిన్నర్లని బాబర్ అజామ్ సమర్థంగా వినియోగించుకోగలిగాడు. దాంతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా చేతులెత్తేసింది. విరాట్ కోహ్లీ క్రీజులో నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే.. 100 పరుగులు చేయడం కూడా కష్టంగా మారేదే.
కోహ్లీ రాణించడంతో భారత్ 151 పరుగులు చేయగలిగింది. ఇక 152 పరుగుల ఛేదనలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో 6x4, 3x6)తో కలిసి బాబర్ అజామ్ (68 నాటౌట్: 52 బంతుల్లో 6x4, 2x6) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేయడంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ విజయం సాధించింది.

విజయం మాదే
'పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. మనపై మనకు గట్టి నమ్మకం ఉండాలి. జట్టుగా మేం రెట్టించి ఉత్సాహంతో ఉన్నాం. ఇప్పటివరకు ప్రపంచకప్ వేదికగా టీమిండియాను ఓడించలేదనేది వాస్తవం. కానీ అదంతా గతం. దాని గురించి మాకు అనవసరం. భవిష్యత్తు గురించే మా ఆలోచనంతా.
అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో మంచి క్రికెట్ ఆడేందుకు బాగా సన్నదమయ్యాం. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్రతతో కూడుకున్నది. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ పరిస్థితులను, ఒత్తిడిని అధిగమించేందుకు అన్ని రకాలుగా సిద్దమయ్యాం. మ్యాచ్‌లో మేం ప్రశాంతంగా ఉంటూ క్రికెట్‌పైనే దృష్టిపెట్టాల్సి అవసరం ఉంది. యూఏఈ పరస్థితులు మాకు బాగా తెలుసు.
గత మూడు, నాలుగేళ్లుగా మేం ఇక్కడ క్రికెట్ ఆడాం. ఇక్కడి వికెట్లు ఎలా ఉంటాయో, పరిస్థితులకు తగ్గట్లు బ్యాట్స్‌మెన్ ఎలా ఆడాలో మాకు అవగాహన ఉంది. మ్యాచ్ జరిగే రోజు ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం. మా లక్ష్యం మాత్రం గొప్పగా ఆడటం. ఎవరు గెలుస్తారనే మీరు అడిగితే మాత్రం మేమే గెలుస్తామని చెబుతా.
విజయానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు రచించుకున్నాం. మా దగ్గర ఉన్న అస్త్ర శ్రస్తాలతో టీమిండియాతో మ్యాచ్‌కు బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా విజయం మాదే అవుతుంది' అని బాబర్ అజామ్ మ్యాచుకు రెండు రోజుల ముందు చెప్పాడు.


Click it and Unblock the Notifications

IND vs PAK: రోహిత్ బదులుగా ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే బాగుండేది.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కోహ్లీ!










