Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK- Asia Cup: ఇవాళ భారత్-పాక్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. మరో మెగాటోర్నీకి వేళైంది. ఇవాళ నుంచి మహిళల ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మొత్తంగా సమరానికి శ్రీలంకలోని దంబుల్లా వేదిక కానుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో యూఏఈతో నేపాల్ తలపడనుంది. మరో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పోటీపడనుంది. గ్రూప్‌-ఏ‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు నేపాల్, యూఏఈ ఉన్నాయి.

కాగా, ఇవాళ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా‌ను మన అమ్మాయిలు చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌ను గెలిచి టీ20 సిరీస్‌ను సమం చేసి మంచి జోరు మీదు ఉన్నారు. ఇదే ఉత్సాహంతో ఆసియాకప్‌ను గెలవాలని కసిగా హార్మన్‌ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. స్మృతి మంధాన సూపర్ ఫామ్‌లో ఉండటం, హర్మన్‌ప్రీత్ మంచి లయలో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం.

IND vs PAK 2024 Asia Cup T20 How to Watch India vs Pakistan Women s Match Live

ఇక షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ నిలకడగా పరుగులు సాధించకపోవడం, బౌలర్లు పరుగులను కట్టడి చేయలేకపోవడం ప్రతికూలాంశాలు. అయితే పాకిస్థాన్‌తో ఉన్నగత రికార్డును పరిశీలిస్తే ఇవాళ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్లు 14 మ్యాచ్‌లు తలపడ్డాయి. వీటిలో ఇండియా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు ఆసియా కప్‌లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఈ మెగాటోర్నీలో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 17 గెలిచింది. కాగా, ఆసియా కప్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడవచ్చు. భారత్-పాక్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్
జులై 19: భారత్ vs పాకిస్థాన్
జులై 21: భారత్ vs యూఏఈ
జులై 23: భారత్ vs నేపాల్
జులై 24: బంగ్లాదేశ్ vs మలేషియా

Story first published: Friday, July 19, 2024, 14:43 [IST]
Other articles published on Jul 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+