
ఇవ్వాళ్టి నుంచే..
దీని తరువాత భారత జట్టు ఆసియా కప్ 2022లో ఆడబోతోంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఇవ్వాళ ఒమన్‌లో ఆరంభం కానున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో తొలి క్వాలిఫయర్ షెడ్యూల్ అయింది. ఇందులో సింగపూర్-హాంకాంగ్ ఢీకొనబోతోన్నాయి. ఫ్యాన్ కోడ్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌లన్నింటినీ ఫ్యాన్‌కోడ్‌లో లైవ్‌లో చూడొచ్చు.

27 నుంచి గ్రూప్స్..
ఈ నెల 27వ తేదీ నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఆ మరుసటి రోజే రెండో మ్యాచ్ ఉంటుంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొంటుంది భారత్. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనిపై ఇప్పటి నుంచే అంచనాలు వెలువడుతున్నాయి.

హై-ప్రెషర్ మ్యాచ్..
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే.. తెలియకుండానే ఓ హై ప్రెషర్ ఏర్పడుతుందని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతారని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. టీమ్‌లో ఒక భావోద్వేగాలకు గురవుతుంటారని పేర్కొన్నాడు. దీన్ని అధిగమించడానికి, ప్లేయర్ల మధ్య సాధారణ వాతావరణం ఏర్పడటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తమ మధ్య ఎలాంటి హైప్ ఏర్పడకుండా చూసుకుంటామని పేర్కొన్నాడు.

ఇతర జట్ల మాదిరిగానే..
ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఇంకో ఎనిమిది రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఉన్నందున ఎలాంటి గేమ్ ప్లాన్‌ను రూపొందిస్తారంటూ అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను కూడా ఓ సాధారణ గేమ్‌గానే పరిగణించేలా జట్టు ప్లేయర్లను తీర్చిదిద్దాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్‌ను కూడా సాధారణ ప్రత్యర్థిగానే చూడాల్సి ఉంటుందని అన్నాడు. తనతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అదే పని మీద ఉంటామని రోహిత్ శర్మ చెప్పాడు.

ఆధిపత్యం టీమిండియాదే..
రెండు దేశాల్లో ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్‌ను చూస్తారని, ఎవరికి వారు అంచనాలను ఏర్పరచుకుంటారని రోహిత్ శర్మ అన్నాడు. ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోందని, దాన్ని నిలబెట్టుకుంటామని, దీనికోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంటోన్నామని స్పష్టం చేశాడు. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియాదే ఆధిపత్యం. ఇప్పటివరకు 14 సార్లు ఈ రెండు జట్లు తలపడగా.. భారత్ ఎనిమిది సార్లు గెలిచింది. పాకిస్తాన్ విజయం సాధించిన మ్యాచ్‌ల సంఖ్య అయిదు.


Click it and Unblock the Notifications
