Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ కేప్టెన్‌తో రోహిత్ శర్మ పకపకలు - ఫొటోలకు ఫోజులు: ట్రోల్స్ షురూ..!!

 IND vs PAK 2022, T20 World Cup: Rohit Sharma and Babar Azam having fun during the photoshoot

ముంబై: ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ 2022 పోరు ఆరంభం కాబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా 12 జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తలపడనున్నాయి. దీని కోసం భారత్ సన్నద్ధమౌతోంది. ఈ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఈ నెల 23వ తేదీన ఆరంభించనుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా రెండు నెలల కిందటే ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్ తరువాత మళ్లీ ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి.

బ్లాక్ బస్టర్ సండే..

ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన ఆదివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్‌లో బ్లాక్ క్యాప్స్‌ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.

కేప్టెన్ల ఫొటోషూట్..

కేప్టెన్ల ఫొటోషూట్..

ఈ ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ 2022 ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో- 16 జట్ల కేప్టెన్లందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అందరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సరదాగా గడిపారు. అదే స్టేజ్‌పై పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. తన పుట్టినరోజును కూడా జరుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబర్ ఆజమ్‌కు ఇతర జట్ల కేప్టెన్లందరూ బర్త్‌డే విషెస్ తెలిపారు. సందడి సందడిగా సాగిందీ ప్రోగ్రామ్.

స్పెషల్ అట్రాక్షన్‌గా..

ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ-బాబర్ ఆజమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరూ ప్రత్యేకంగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రొటోకాల్ ప్రకారం.. రెండు జట్ల కేప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొనడం ఆనవాయితీ. దీన్ని కొనసాగించారీ ఇద్దరు కేప్టెన్లు. డిఫరెంట్ ఫోజుల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. సరదాగా, స్నేహితుల్లా గడిపారు.

ట్రోల్స్ షురూ..

ట్రోల్స్ షురూ..

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే ట్రోల్స్ మొదలయ్యాయి. రోహిత్ శర్మపై క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆసియా కప్‌లోనూ ఇలాగే ఫొటోలకు ఫోజులిచ్చారని, దాని సంగతి ఏమైందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానిస్తోన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసి కూడా క్లోజ్‌గా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.

Story first published: Saturday, October 15, 2022, 12:46 [IST]
Other articles published on Oct 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+