Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ: భారత్‌తో మ్యాచ్‌కు ముందు అనూహ్యం: సగం మ్యాచ్ గెలిచినట్టే..!!

IND vs PAK 2022: Shaheen Shah Afridi ruled out of the Asia Cup 2022

ఇస్లామాబాద్: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2022 మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైన వేళ.. ఇందులో భాగంగా బలమైన భారత జట్టును ఎదుర్కొనడానికి సిద్ధపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా ఇది ఆ జట్టును కోలుకునే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆసియా కప్‌లో భారత్‌పై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడా అంటూ బాబర్ ఆజమ్ టీమ్ ఎదురు చూస్తోన్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

 తప్పుకొన్న అఫ్రిది..

తప్పుకొన్న అఫ్రిది..

పాకిస్తాన్ బౌలింగ్ వెన్నెముక, ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది గాయపడ్డాడు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఈ టోర్నమెంట్ ఒక్కటే కాదు. దీని తరువాత ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉన్న పాకిస్తాన్ జట్టులోనూ అతనికి చోటు లభించకపోవచ్చు. గాయం వల్ల కనీసం ఆరు వారాల పాటు షహీన్ షా అఫ్రిది విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మళ్లీ అతను అక్టోబర్‌లో జట్టులోకి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

 ఫీల్డింగ్ చేస్తూ..

ఫీల్డింగ్ చేస్తూ..

ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్ట్ ఆడుతున్న సమయంలో షహీన్ షా అఫ్రిది గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. ఆ తరువాత అతనికి స్కానింగ్ నిర్వహించగా.. కుడి మోకాలి ఎముక చిట్లినట్లు తేలింది. నెదర్లాండ్స్‌లోని రొట్టెన్‌డామ్‌లో గల రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.

నెదర్లాండ్స్‌లో..

నెదర్లాండ్స్‌లో..

రొట్టెన్‌డామ్‌లో రిహాబిలిటేషన్ నుంచి రిపోర్ట్స్ అందిన తరువాత షహీన్ షా అఫ్రిది మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడతాడనేది చెప్పగలమని పీసీబీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరుల్లా సూమ్రో తెలిపారు. గాయం వల్ల ఆసియా కప్ నుంచి వైదొలగాల్సి వచ్చినట్లు అతనికి తెలియజేశామని చెప్పారు. తీవ్ర నిరాశకు గురయ్యాడని, అతని ఆవేదనను అర్థం చేసుకోగలమని నజీరుల్లా వ్యాఖ్యానించారు. అఫ్రిది తమకు ఎంతో విలువైన ఆటగాడని, అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

ఎల్లుండి దుబాయ్‌కు..

ఎల్లుండి దుబాయ్‌కు..

రొట్టెన్‌డామ్ రిహాబిలిటేషన్ సెంటర్‌తో పాకిస్తాన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సోమవారం దుబాయ్‌కు బయలుదేరనుంది. నెదర్లాండ్స్ నుంచి నేరుగా దుబాయ్‌కు చేరుకుంటుంది. షహీన్ షా అఫ్రిది మాత్రం అక్కడే ఉంటాడు. రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటాడు. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 28వ తేదీన భారత్‌ను ఢీ కొట్టనుంది పాకిస్తాన్.

Story first published: Saturday, August 20, 2022, 16:51 [IST]
Other articles published on Aug 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+