Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాతో పెట్టుకోకురోయ్ - కూసాలు కదుల్తాయ్..!!

 IND vs PAK 2022: Hardik Pandya took 11 wickets against Pakistan in last 5 T20Is.

మెల్‌బోర్న్: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా పోరుసాగుతోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట భారత బౌలర్లు రెచ్చిపోయారు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. ప్రత్యేకించి పేస్ బౌలర్లు తమ తఢాఖా చూపారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ చెలరేగారు. అటు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పాకిస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

బ్యాటింగ్ కకావికలం..

బ్యాటింగ్ కకావికలం..

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఇన్నింగ్ తడబడింది. ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఇన్నింగ్ తొలి బంతికే కేప్టెన్ బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో డాషింగ్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సైతం భారీ స్కోర్ చేయడంలో విఫలం అయ్యాడు. 12 బంతుల్లో అతను చేసిన పరుగులు నాలుగే. మిడిలార్డర్ బ్యాటర్లు షాదబ్ ఖాన్-5, హైదర్ అలీ-2, మహ్మద్ నవాజ్-9, ఆసిఫ్ అలీ-2, షహీన్ షా అఫ్రిది- 16 పరుగులు చేశారు.

ఆ మాత్రం స్కోరైనా..

ఆ మాత్రం స్కోరైనా..

టాప్ ఆర్డర్ బ్యాటర్లు షాన్ మసూద్- 52, ఇఫ్తికర్ అహ్మద్-51 పరుగులు చేయకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారై ఉండేది. టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులను సంధించారు. లైన్ అండ్ లెంగ్త్‌ విసిరిన బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు. పాకిస్తాన్ బ్యాటర్లకు ఊపిరి సలపని రేంజ్‌లో ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ మూడు చొప్పున వికెట్లను పడగొట్టారు.

సత్తా చాటిన హార్దిక్..

సత్తా చాటిన హార్దిక్..

ప్రత్యేకించి- హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మరోసారి మెరిశాడు. టీ20 ఫార్మట్ స్పెషలిస్ట్‌గా తనకు ఉన్న పేరును అతను మరోసారి నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్‌ అనగానే తనలోని కొత్త కోణాన్ని చూపిస్తుంటాడీ గుజరాతీ. ఇప్పుడూ అదే జరిగింది. పాకిస్తాన్‌పై మళ్లీ విరుచుకుపడ్డాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులు ఇచ్చి- మూడు వికెట్లను నేలకూల్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు హార్దిక్.

చివరి అయిదు మ్యాచ్‌లల్లో..

చివరి అయిదు మ్యాచ్‌లల్లో..

హార్దిక్ పాండ్యా దెబ్బకు మిడిలార్డర్ బ్యాటర్లు షాదబ్ ఖాన్-5, హైదర్ అలీ- 2, మహ్మద్ నవాజ్- 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. పాకిస్తాన్‌పై సహజంగానే తన ప్రతాపాన్ని చూపుతుంటాడు హార్దిక్ పాండ్యా. అది అతని సహజ స్వభాగంగా మారింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో వికెట్‌లెస్‌ కాదతను. ఈ అయిదింట్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు మ్యాచ్‌లల్లో మూడు చొప్పున, మిగిలిన రెండింట్లో ఒక్కో వికెట్ తీసుకున్నాడు.

Story first published: Sunday, October 23, 2022, 16:26 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+