Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: సచిన్‌, కోహ్లికే సాధ్యం కానీ ఘనత.. చరిత్ర సృష్టించిన జైస్వాల్!

టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లికే సాధ్యం కానీ ఘనత అందుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులోపు ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1000+ పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా జైస్వాల్ చరిత్రకెక్కాడు. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఈ ఏడాది 10 టెస్టులు ఆడిన యశస్వీ జైస్వాల్ 59.23 సగటు, 75.88 స్ట్రైక్‌రేటుతో 1007 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు బాదాడు. 2024లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా జో రూట్ (1305) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జైస్వాల్ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. 23 ఏళ్ల వయస్సులోపు 1000+ పరుగులు చేసిన అయిదో బ్యాటర్‌గా వరల్డ్ రికార్డులకెక్కాడు.

IND vs NZ Yashasvi Jaiswal Enters Elite 1000 Test Runs Club in a Calendar Year Before Turning 23

ఈ ఘనతను జైస్వాల్ కంటే ముందు ఇప్పటివరకు నలుగురు మాత్రమే సాధించారు. 1958లో గార్ఫీల్డ్ సోబెర్స్ 1193 పరుగులు చేశాడు. 2003లో గ్రేమ్ స్మిత్ 1198 పరుగులు, 2005లో ఏబీ డివిలియర్స్ 1008 పరుగులు, 2006లో అలెస్టర్ కుక్ 1013 పరుగులు చేశారు. కాగా, ఈ ఏడాది న్యూజిలాండ్‌తో మూడో టెస్టుతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో జైస్వాల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో సోబెర్స్‌తో సహా మిగిలిన దిగ్గజాలను జైస్వాల్ అధిగమించే అవకాశం ఉంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38; 46 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జైస్వాల్ (30; 60 బంతుల్లో, 4 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (30; 72 బంతుల్లో, 2 ఫోర్లు,1 సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్; 21 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. ఫిలిప్స్ రెండు, సౌథి ఒక్క వికెట్ తీశాడు. కివీస్ 103 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది.

Story first published: Friday, October 25, 2024, 13:03 [IST]
Other articles published on Oct 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+