IND VS NZ WTC Final Trolls:అప్పుడు వర్షం వచ్చే వన్డే ప్రపంచకప్ చేజారింది.. ఇప్పుడేం జరుగుతుందో శివయ్యా!

WTC Final: అప్పుడు 2019 ODI World Cup పోయే.. ఎవడ్రా ప్లాన్ చేసింది Hilarious Trolls| Oneindia Telugu

సౌతాంప్టన్‌: ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) తుది సమరానికి భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019-21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్‌ ఫైనల్‌ చేరాయి. అయితే అభిమానులు ఎంతగానో చూస్తున్న ఈ మ్యాచ్‌పై వరుణుడు కన్నెర్ర చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది. దాంతో తొలి రోజు ఆట సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో ఐసీసీని ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పుడేం జరుగుతుందో శివయ్యా!

2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కూడా ఇలానే వర్షం వచ్చి భారత్ కొంపముంచిందని, మరీ ఈ సారి ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. వరుణుడి అంతరాయం కలిసొచ్చిందని, రిజర్వ్ డేలో పిచ్ అనూహ్యంగా పేస్, స్వింగ్‌ను అనుకూలించడంతో బోల్డ్, మ్యాట్ హెన్రీ చెలరేగారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని, ఈసారి భారత్ పరిస్థితి ఏంటోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్‌లో జరిగిన ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు ఇదే పరిస్థితి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.

ఎవడ్రా వర్షాకాలంలో ప్లాన్ చేసింది..

ప్రతిష్టాత్మ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షాకాలంలో షెడ్యూల్ చేసినందుకు ఐసీసీకి బుద్ది లేదని భగ్గుమంటోన్నారు. అసలు ఇంగ్లండ్‌లో ఎవడ్రా మ్యాచ్‌లు పెట్టమన్నదని కూడా మండిపడుతున్నారు.

తమ ఆగ్రహానికి కామెడీని జోడించి.. ట్వీట్లు చేస్తోన్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వర్షంలో బ్యాటింగ్ చేస్తూ జారిపడుతున్న వీడియోలను పంచుకుంటున్నారు. ఐసీసీకి ముందు చూపు లోపించిందంటూ విరుచుకుపడుతున్నారు.

ఫస్ట్ డే వాష్ ఔట్..

సౌతాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్‌ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్‌లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతేనే మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి చూస్తుంటే ఫస్ట్ డే ఆట జరగడం కష్టంగానే అనిపిస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 18, 2021, 12:59 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X