IND vs NZ: ఫుల్‌టాస్‌కు క్లీన్ బౌల్డ్.. బాధతో మైదానాన్ని వీడిన కోహ్లి (Video)
పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ స్వల్ప వ్యవధిలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 16/1తో ఇవాళ ఆట ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ (30; 72 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)ను మిచెల్ శాంటర్న్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూని కోరకుండానే గిల్ పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే వెనుదిరగాడు. అయితే కోహ్లి ఔటైన తీరు స్టేడియంలోని అభిమానులతో పాటు కామెంటరీ చేస్తున్న వ్యాఖ్యాతలను ఆశ్చర్చానికి గురిచేసింది. మిచెల్ శాంటర్న్ వేసిన ఫుల్ టాస్‌కు కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిడ్‌వికెట్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి కాళ్లను కదల్చకుండా ట్రై చేసి మూల్యం చెల్లించకున్నాడు. అంతకుముందు అదే తరహా బంతి ఫుట్ వర్క్‌తో చక్కని షాట్ ఆడాడు.

పేలవ షాట్ ఎంపికతో ఫుల్ టాస్ బంతికి ఔటైయ్యానని కోహ్లి అయిష్టంగా పెవిలియన్ బాట పట్టాడు. కోపంతో బ్యాటును విసరడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత బాధతో మైదానాన్ని వీడాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన కోహ్లి, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు. కాగా, కోహ్లి ఔటైన కాసేపటికే కుదురుకున్న యశస్వీ జైస్వాల్ (30; 60 బంతుల్లో, 4 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు.
గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో డారిల్ మిచెల్‌కు జైస్వాల్ చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (18; 19 బంతుల్లో, 2 ఫోర్లు) ఫిలిప్స్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 83 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (4), రవీంద్ర జడేజా ఉన్నారు. న్యూజిలాండ్ కంటే భారత్ 176 పరుగుల వెనుకంజలో ఉంది.
THE Great Virat Kohli can't even play a full toss 😭😭 pic.twitter.com/XNomySBHqt
— ADITYA (@140OldTrafford) October 25, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications