కోపంతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో మరోసారి ఔటవ్వం, అంపైర్ కాల్ తనకి ప్రతికూల ఫలితం ఇవ్వడంతో.. కోహ్లి విపరీతమైన కోపంతో ఐస్ బాక్స్‌ను బద్దలుకొట్టాడు. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఈ సంఘటన జరిగింది.
ఛేదనలో మిచెల్ శాంట్నర్ వేసిన 29వ ఓవర్ చివరి బంతిని కోహ్లి డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకింది. న్యూజిలాండ్ అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఔటిచ్చాడు. వెంటనే కోహ్లి రివ్యూని కోరాడు. బంతి లెగ్ స్టంప్‌ను మిస్సవుతుందనే ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకున్నాడు. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్‌తో ఔట్‌గా తేల్చారు.

అనంతరం అంపైర్‌ను ఆవేశంగా చూస్తూ విరాట్ కోహ్లి మైదానాన్ని వీడాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో కోపాన్ని నియంత్రించుకోలేని కోహ్లి.. అక్కడే ఉన్న ఐస్ బాక్స్‌ను తన బ్యాటుతో బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి శాంట్నర్ బౌలింగ్‌లోనే ఔటైన సంగతి తెలిసిందే. ఫుల్ టాస్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. కోహ్లి కెరీర్‌లో ఇది అత్యంత చెత్త ఔట్ అని విమర్శలు వచ్చాయి.
తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేసిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) సత్తాచాటారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో విజృంభించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (86) టాప్ స్కోరర్. సుందర్ నాలుగు, జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకే పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) పోరాడారు. మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లతో చెలరేగాడు.
Virat Kohli broken the ice box 🧊😂#WhistlePodu #INDvsNZ @ImvKohlipic.twitter.com/7Nz3qp0OZe
— CSK Fans Army™ (@CSKFansArmy) October 26, 2024