Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs Nz: ఫైనల్ ముందు భారత్‌కు బిగ్ షాక్ - విరాట్ కోహ్లీకి గాయం - ఇప్పుడెలా ఉందంటే?

Virat Kohli injury: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ కు రంగం సిద్ధమైంది. ఈ ఫైనల్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడున్నాయి. ఈ పోరులో టీమిండియా స్టార్స్ కోహ్లీ, రోహిత్ అదిరే ప్రదర్శన చేయాలని భారత క్రికెట్ అభిమానులంతా బలంగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ను టెన్షన్ లో పడేసే బిగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

గాయం ఎలా అయిందంటే?
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయమైనట్లు తెలిసింది. ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. నెట్‌ బౌలర్‌ వేసిన బంతి తగిలి గాయం అయిందట. ఆ బౌలర్‌ సంధించిన బంతి నేరుగా విరాట్‌ కోహ్లీ మోకాలికి తాకినట్లు సమాచారం అందుతోంది. దీంతో వెంటనే విరాట్ కు ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి బ్యాండేజీ వేశారట. ప్రస్తుతం ఈ విషయం గురించి ఇంగ్లీష్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

IND vs NZ Virat Kohli injured in practice ahead of Champions Trophy 2025 final

విరాట్ పరిస్థితి ఎలా ఉందంటే?
అయితే విరాట్‌ కోహ్లీ నడవగలిగే పరిస్థితిలోనే ఉన్నాడని క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఫైనల్ మ్యాచ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే కోహ్లీ ఆడతాడని అంటున్నారు. అయినప్పటికీ విరాట్‌ కోహ్లీకి గాయం అయిందనే విషయం తెలియగానే అభిమానులంతా కాస్త ఆందోళన చెందుతున్నారు.

విరాట్ త్వరగా కోలుకుని ఫైనల్‌ మ్యాచ్ ఆడాలని, అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా, ఫైనల్ మ్యాచ్ ను జియో హాట్‌ స్టార్‌ లో ఫ్రీగానే చూడొచ్చు. లేదంటే స్టార్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ 18 ఛానల్స్ లోనూ వీక్షించొచ్చు.

Story first published: Saturday, March 8, 2025, 17:23 [IST]
Other articles published on Mar 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+