న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌ను కలవరపెడుతున్న చెత్త రికార్డు.. గత 18 ఏళ్లుగా గెలిచిందే లేదు!

IND vs NZ : ఇది మరీ ఘోరం భయ్యా.. గత 18 ఏళ్లుగా గెలిచిందే లేదు! || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే కీలక పోరు ముందు ఓ చెత్త రికార్డు టీమిండియాను కలవర పెడుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. టోర్నీలో ముందుకు కొనసాగాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఆదివారం కివీస్‌తో జరిగే పోరు భారత జట్టుకు చావోరేవోలా మారింది. అయితే 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు.

ఈ 18 ఏళ్ల కాలంలో ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఏడు సార్లు తలపడిన భారత జట్టు.. ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. చివరకు ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ టీమిండియాను ఓటమే వెక్కిరించింది.

2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచినా..

2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచినా..

2003 వన్డే ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్లతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో కివీస్‌తో ఆడే అవకాశం రాలేదు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కూడా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ధోనీ సేన ఒక్క కివీస్ చేతిలోనే 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

2016‌లో చిత్తుగా..

2016‌లో చిత్తుగా..

ఆ తర్వాత 2009 చాంపియన్స్ ట్రోఫీలో కివీస్‌తో ఆడే అవకాశం రాలేదు. ఇక భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్‌లోనూ కివీస్‌తో తలపడలేదు. అనంతరం జరిగిన 2012 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ ధోనీ సేన.. న్యూజిలాండ్‌‌తో తలపడలేదు. వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు సాధ్యం కాలేదు.

2016 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ధోనీసేన 47 పరుగులతో చిత్తయింది. స్పిన్ ట్రాక్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేసింది. దాంతో భారత్ విజయం సులువని అంతా భావించారు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్(4/11), ఇష్ సోది(3/18) చెలరేగడంతో భారత్ 79 పరుగులకే కుప్పకూలింది.

ధోనీ పోరాడినా..

ధోనీ పోరాడినా..

2017 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడలేదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. కీలకమైన సెమీస్‌లో భారత్ 18 పరుగులతో ఓటమిపాలైంది. టాపార్డర్ విఫలమైన వేళ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది.

ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ ఆడిన 6 సిరీస్‌ల్లో 5 గెలవగా.. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మాత్రం క్లీన్ స్వీప్ అయింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడటం గమనార్హం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డలపై ఓడించిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో మాత్రం ఓటమిపాలైంది.

ఫైనల్లో రెండు సార్లు ఓటమి..

ఫైనల్లో రెండు సార్లు ఓటమి..

క్రికెట్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో రెండు సార్లు తలపడగా.. ఆ రెండుసార్లు కూడా న్యూజిలాండే విజయం సాధించింది. ఐసీసీ నిర్వహించిన 2000 నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన కివీస్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇక్క ఈ ఏడాది జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ న్యూజిలాండే గెలుపొందింది.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటి వరకు కివీస్ ఖాతాలో ఉన్నఐసీసీ టైటిల్స్ ఇవే. టీ20 క్రికెట్‌ విషయానికొస్తే న్యూజిలాండ్, భారత్ మధ్య ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు జరగా.. ఇరు జట్లు ఎనిమిదేసి విజయాలు అందుకున్నాయి. మరీ ఆదివారం జరిగే పోరులో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. ఇరు జట్లు పాకిస్థాన్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం గమనార్హం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 28, 2021, 17:04 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X