
అబుధాబి: యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన మ్యాచ్‌ను ఆడనుంది. తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ ఆదివారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లు కూడా ఒక్కో పరాజయాన్ని అందుకున్నాయి.
ఈ నెల 24వ తేదీన ఇదే దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. పరాజయాన్ని చవి చూసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఇదే పాకిస్తాన్ జట్టు తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టి కరిపించింది. మంగళవారం రాత్రి నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది పాకిస్తాన్ టీమ్.
పాకిస్తాన్ చేతిలో పరాభవానికి గురైన భారత్-న్యూజిలాండ్ జట్లు ఫేస్ టు ఫేస్ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ముందుకు సాగాలంటే రెండు జట్లకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. బలమైన టీమిండియాను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతున్న న్యూజిలాండ్ జట్టుకు అనుకోని విఘాతం తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ లోకీ ఫెర్గూసన్ గాయపడ్డాడు. టీమిండియాతో మ్యాచ్‌కే కాదు.. టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని కుడి కాలి చీలమండంలో తేలికపాటి ఫ్రాక్చర్ ఏర్పడింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అతను అందుబాటులో లేడు.
చీలమండం నొప్పితో గాయపడుతున్న అతనికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించగా.. ఫ్రాక్చర్‌గా తేలింది. దీనితో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లోకీ ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నెను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేను ఆడించడానికి అవకాశం ఇవ్వాలంటూ కివీస్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ కమిటీకి దరఖాస్తు చేసుకుంది.