IND vs NZ: భారత స్టార్ బ్యాటర్‌కు గాయం.. తుదిజట్టులోకి సర్ఫరాజ్!
బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తుకు అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. గాయం కారణంగా కీలక బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరమవ్వడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. అయితే భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.

కాగా, తొలి టెస్టు ప్రారంభానికి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మెడనొప్పి కారణంగా గిల్ అసౌకర్యంగా తలను కదిలిస్తున్నాడని, ప్రస్తుతం ఫిజియో పర్యవేక్షణలో ఉన్నాడని జాతీయ మీడియా పేర్కొంది. రేపటి ఉదయానికి గిల్ పూర్తిగా కోలుకోలేకపోతే, సర్ఫరాజ్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందని సమాచారం.
ఇటీవల ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కలేదు. ఇరానీ కప్ ఆడమని, రెండో టెస్టుకు ముందు అతన్ని జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసింది. అయితే సీనియర్ కేఎల్ రాహుల్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులోనూ సర్ఫరాజ్ నిరాశే ఎదురవుతుందని భావించారంతా. కానీ గిల్‌కు గాయమవ్వడంతో సర్ఫరాజ్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం వచ్చింది. కాగా, గిల్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications