పుణె వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ తన బలమైన నమ్మకంతో భారత్‌కు వికెట్‌ను అందించాడు. క్యాచ్ అందుకున్న రిషభ్ పంత్ కూడా నమ్మకంతో లేనప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మను సర్ఫరాజ్ బలవంతంగా ఒప్పించి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయేలా చేశాడు.
అసలేం జరిగిందంటే.. 24వ ఓవర్ ఆఖరి బంతిని రవిచంద్రన్ అశ్విన్ లెగ్ సైడ్ దిశగా వేశాడు. విల్ యంగ్ దాన్ని షాట్‌కు యత్నించాడు. అయితే విల్ బ్యాట్-గ్లవ్స్‌కు అతి దగ్గరగా వెళ్లిన బంతి వికెట్ల వెనుక ఉన్న పంత్ అందుకున్నాడు. ఔట్‌గా అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే ఇది కచ్చితంగా ఔట్ అని, రివ్యూకి వెళ్లాలని షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్ రోహిత్‌ను కోరాడు.

మరోవైపు క్యాచ్ అందుకున్న పంత్ మాత్రం ఔట్ అని నమ్మకంగా చెప్పలేకపోయాడు. రివ్యూకి వెళ్లకపోవడమే మంచిది అన్నట్లుగా బదులిచ్చాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం రోహిత్‌ను బలవంతంగా ఒప్పించాడు. తనని నమ్మమని, సమీక్షకు వెళ్లాలని అన్నాడు. విరాట్ కోహ్లి కూడా సర్ఫరాజ్‌కు మద్దతు ఇస్తూ రోహిత్‌ను ఒప్పించాడు. అశ్విన్ కూడా రివ్యూకి వెళ్లమని చెప్పడంతో కెప్టెన్ హిట్‌మ్యాన్ సమీక్షకు వెళ్లాడు. రివ్యూలో విల్ యంగ్ ఔట్ అని తేలింది.
కామెంటరీలో ఉన్న దినేశ్ కార్తీక్.. సర్ఫరాజ్‌ను కొనియాడాడు. విల్ యంగ్ వికెట్‌కు ప్రధాన కారణం సర్ఫరాజ్ అని అన్నాడు. సమీక్ష కోరడానికి అతనే కారణమని అన్నాడు. సర్ఫరాజ్‌తో పాటు కోహ్లి కూడా రోహిత్‌ను ఒప్పించాడని చెప్పాడు. సర్ఫరాజ్-కోహ్లి కలిసి భారత్‌కు వికెట్ అందించారని డీకే తెలిపాడు. కాగా, లంచ్ విరామానికి న్యూజిలాండ్ 31 ఓవర్లకు 92/2 స్కోరు చేసింది. అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. క్రీజులో డెవాన్ కాన్వే (47), రచిన్ రవీంద్ర (5) ఉన్నారు.
in #2nd_Test
— A. Wahid (@A__Wahid) October 24, 2024
Keeper Bowler Captain kisi ko nahi Suna
Sarfaraz khan Bola Please Mujh Par Bharosa Karo.#INDvsNZ pic.twitter.com/wkyTUNmMqp