IND vs NZ: అన్‌లక్కీ ఔట్.. కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ (Video)
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతిని రోహిత్ చక్కగా డిఫెన్స్ చేసినప్పటికీ వికెట్‌ను కోల్పోయాడు. ఊహించని ఈ వికెట్‌ను చూసి నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లితో సహా స్టేడియంలోని అభిమానులు ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఔటైన అనంతరం రోహిత్ శర్మ తన దురదృష్టాన్ని చూసి తలపట్టుకున్నాడు. క్రీజులోనే భావోద్వేగానికి గురయ్యాడు. తర్వాత బాధగా మైదానాన్ని వీడాడు. అసలేం జరిగిందంటే.. అజాజ్ పటేల్ వేసిన 22వ ఓవర్ అయిదో బంతిని ఆఫ్ స్టంప్‌గా లెంగ్త్ డెలివరీ వేశాడు. రోహిత్ దాన్ని ఫార్వర్డ్ డిఫెన్స్ చేశాడు. బ్యాటు ఔట్ సైడ్‌కు తాకింది. అయితే ప్యాడ్స్-బ్యాట్ మధ్య ఉన్న ఖాళీ నుంచి బంతి వన్ స్టెప్ తీసుకోని నిదానంగా వికెట్లు వైపు కదిలింది.

రోహిత్ దాన్ని గమనించి వెనుదిరిగి చూసేలోపే బంతి నిదానంగా వెళ్తూ వికెట్లను తాకింది. బెయిల్స్ కింద పడటంతో రోహిత్ నిస్సహాయంగా మిగిలిపోయాడు. చిన్నస్వామి స్టేడియమంతా నిశ్శబ్ధంగా మారింది. అయితే అంతకుముందు ఓవర్‌లోనే రోహిత్ వరుసగా 4, 6, 4 బౌండరీ బాది అర్ధశతకం సాధించాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో పుల్‌షాట్‌తో బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. కానీ 50 మార్క్ అందుకున్న అనంతరం రోహిత్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
63 బంతుల్లో రోహిత్ శర్మ 53 పరుగులు చేశాడు. ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్ సాధించాడు. కాగా, ప్రస్తుతం 26 ఓవర్లకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి (19), సర్ఫరాజ్ ఖాన్ (13) ఉన్నారు. టీమిండియా ఇంకా 235 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది.
Reaction of crowd in chinnaswamy stadium 🏟️ Unlucky #RohitSharma𓃵 #INDvNZ #Captaincy #TestCricket #Hitman #WTC25 pic.twitter.com/cNDoPp3OdY
— ANJALI THAKUR (@anjali95479) October 18, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications