Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఫైనల్‌లో విజయం ఆ జట్టుదే - విజేత ఎవరో చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్కుడు!

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 9న ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా ఎరుగని భారత్.. ఫైనల్ లోనూ విజయకేతనం ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో లీగ్ స్టేజ్ పై భారత్ చేతిలో మాత్రమే ఓడిన న్యూజిలాండ్.. తుది పోరులో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడలని కసితో ఉంది. భారత క్రికెట్ అభిమానులంతో టీమిండియానే గెలివాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ లో విజయం ఎవరిని వరించబోతుందో తెలిపారు ఓ ప్రముఖ జోతిష్కుడు. టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందో వివరించారు.

గ్రూప్ ఏ లీగ్ స్టేజ్ లో వరుసగా మూడు విజయాలు, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత జట్టే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలుస్తుందని తన అంచనాను పంచుకున్నారు జోత్యిష్కుడు గ్రీన్ స్టోన్ లోబో. 2024 టీ20 ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరుతుందని అన్నారు.

IND vs NZ Rohit sharma s India won Champions Trophy 2025 title predicts Astrologer Greenstone Lobo

"రోహిత్ శర్మ గురించి తెలుసుకున్నాను. ధోనీ తర్వాత ఈ ప్రపంచంలోనే ఓ గొప్ప ప్లేయర్ ఎవరైనా పుట్టాడా అంటే అది రోహిత్ శర్మనే అని కచ్చితంగా చెప్పగలను. అతడిది మంచి జాతకం. అతడి గొప్పతనం ఈ జాతకంలో కనిపిస్తోంది. అతడు మేజర్ టోర్నమెంట్స్ లో గెలవగలే సత్తా ఉన్న గొప్ప కెప్టెన్ అతడని జాతక చక్రంలో ఉంది. అయితే, అద్భుతమైన జాతకం ఉన్నప్పటికీ 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ ఎందుకు గెలవలేదంటే, అతడు తన గెలుపు కర్మ కోటాను ఉపయోగించుకున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత గెలవాలని రాసి పెట్టి ఉంటదో అంత మాత్రమే గెలుస్తాడు. కెప్టెన్‌గా అతడు ఐదు ఐపీఎల్ టైటిళ్లను సాధించి, ఇప్పటికే తన గెలుపు కోటాలో గణనీయమైన భాగాన్ని ఉపయోగించుకున్నాడు. అదే అతడు ఆటగాడిగా వాటిని గెలిచి ఉంటే, పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. కానీ అతడు కెప్టెన్‌గా ఇప్పటికే ఎక్కువ టైటిల్లు గెలిచాడు కాబట్టి, తన గెలుపు కోటాలో గణనీయమైన భాగాన్ని ఉపయోగించేసుకున్నాడని అర్థం. అందుకే అతడు ప్రపంచ కప్ గెలవలేకపోయాడు." అని లోబో పేర్కొన్నారు.

కోహ్లీ-రోహిత్ కలిసి..
"ప్రస్తుతం రోహిత్ జాతకం ప్రకారం వరల్డ్ కప్ తో పోలిస్తే అతడు మరో రెండు చిన్న టోర్నమెంట్స్ గెలుస్తాడని తెలుస్తోంది. అందులో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫి. ఫైనల్ గా రోహిత్ - కోహ్లీ కలిసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించబోతున్నారు. ఇకపోతే రోహిత్ శర్మ జాతకం.. లియోనాల్ మెస్సీ జాతకానికి దగ్గరగా ఉంది. ఇద్దరూ ఒకే ఏడాదిలో పుట్టారు." అని లోబో చెప్పుకొచ్చారు.

Story first published: Friday, March 7, 2025, 15:16 [IST]
Other articles published on Mar 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+