బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పెద్దగా మార్పులేమి లేవు. బంగ్లాతో సిరీస్‌కు 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించగా, కివీస్ సిరీస్‌కు మాత్రం యశ్‌దయాల్‌ను తప్పించి 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. అయితే ఆటగాళ్ల పేర్లు కాకుండా జట్టు ప్రకటనలో ఓ ప్రధాన మార్పు ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా వైస్‌కెప్టెన్‌గా పేర్కొంది.
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని బీసీసీఐ పేర్కొనలేదు. అంతకుముందు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టుకు మాత్రం శుభ్‌మన్ గిల్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించింది. టీ20, వన్డే ఫార్మాట్లకు గిల్‌ను ఉపసారథిగా ఎంపిక చేసింది. అన్నిఫార్మాట్లు ఆడే ప్లేయర్‌కు సారథి బాధ్యతలు అందివ్వాలనే ఉద్దేశంతో, భవిష్యత్ సారథిగా గిల్‌ను సిద్ధం చేస్తున్నామని బీసీసీఐ పరోక్షంగా పేర్కొంది. కానీ లంక పర్యటనతోనే ఆ ఆలోచన ముగిసింది.

తాజాగా, బుమ్రాను వైస్‌కెప్టెన్‌ను చేసింది. దీని గురించి మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి బెంగళూరు వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు.''బుమ్రా ఎంతో క్రికెట్ ఆడాడు. అతను ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. బుమ్రా ఎంతో తెలివైనవాడు. దీని గురించి వ్యూహాత్మకంగా ఎక్కువగా చెప్పలేను. ఎందుకంటే అతను ఓ టెస్టు, కొన్ని టీ20లకు మాత్రమే కెప్టెన్సీ చేశాడు''
''జట్టుకు ఏం అవసరమో బుమ్రా గొప్పగా అర్థంచేసుకుంటాడు. నాయకుడు కావాల్సిన పరిస్థితిలో బుమ్రా ముందుకు వస్తాడు. గత కొన్నాళ్లుగా అతను నాయకత్వ సమూహంలో ఉన్నాడు. యువ బౌలర్లకు మార్గనిర్దేశకం చేయడంలో, జట్టు ముందుకు సాగడంపై అంతర్గతంగా జరిగే చర్చలో బుమ్రా ఎప్పుడూ ఉంటాడు'' అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచిఉంది.