IND VS NZ: రోహిత్ శర్మ బిగ్ అనౌన్స్‌మెంట్ - వన్డే రిటైర్మెంట్‌పై క్లారిటీ
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కివీస్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ తుది పోరులో టీమిండియా సారథి రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు) అద్భుతంగా రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ ఫైనల్ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగింది. మ్యాచ్ అనంతరం దీనిపై స్పష్టత ఇచ్చాడు రోహిత్ శర్మ.
"రెండు ఐసీసీ ట్రోఫీలను గెలవడమనేది ఓ జట్టుకు పెద్ద విజయం. చాలా తక్కువ జట్లు ఇలా విజయం సాధించడం నేను చూశాను. ఇక్కడికి (దుబాయ్) వచ్చిన తర్వాత బాగా సన్నద్ధమై, మా ముందున్న సవాల్ ను ఎదుర్కొని ఆడటం చాలా ముఖ్యం. మేం పరిస్థితులును అర్థం చేసుకుని ఉపయోగించుకున్నాం. టైటిల్ ను సాధించాం." అని రోహిత్ అన్నాడు.

నో రిటైర్మెంట్..
భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా రోహిత్ సమాధానమిచ్చాడు. భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నాడు. "నాకు భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలు లేవు. జరగాల్సింది అదే జరుగుతుంది. నేనైతే ఈ ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించట్లేదు. నా రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దు." అని చెప్పుకొచ్చాడు.
ROHIT SHARMA DROPS BANGER. 🎤
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
- 2027 World Cup in South Africa.🤞🇮🇳 pic.twitter.com/SKPGbIOeQg
రోహిత్ చెప్పిన ఈ సమాధానం అతడి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడని, అప్పటివరకు ఆటకు వీడ్కోలు పలకడని అంతా ఫిక్సైపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications