IND vs NZ: చరిత్ర సృష్టించిన పంత్!
వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్- విధ్వంసకర బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. పంత్ కంటే ముందు ఈ మార్క్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, టీమిండియా సారథి రోహిత్ శర్మ సాధించారు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు 92 ఇన్నింగ్స్‌లు ఆడిన బెన్ స్టోక్స్ 81 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్‌ల్లో 56 సిక్సర్లు బాదాడు. ఇక రిషభ్ పంత్ 51 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ సిక్సర్లు సాధించాడు. పంత్ తర్వాతి స్థానాల్లో యశస్వీ జైస్వాల్ (35 సిక్సర్లు - 26 ఇన్నింగ్స్‌లు), జానీ బెయిర్‌స్టో (32 సిక్సర్లు- 67 ఇన్నింగ్స్‌లు), శుభ్‌మన్ గిల్ (31 సిక్సర్లు - 54 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

కాగా, రోడ్డు ప్రమాదం అనంతరం దాదాపు 21 నెలల తర్వాత ఇటీవల తిరిగి టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో 12 సిక్సర్లు బాదాడు. ఇక ప్రస్తుత మూడో టెస్టు ఛేదనలో సహచరులు బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శ్రమిస్తుంటే పంత్ సిక్సర్‌తో ఖాతాను తెరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో బౌలర్ తల మీదుగా సిక్సర్ బాదాడు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
రవీంద్ర జడేజా (6)తో కలిసి ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ 48 బంతుల్లో అర్ధశతకం బాదాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగలు చేసి వెనుదిరిగాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత్ విజయానికి 41 పరుగులు అవసరం. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (9 నాటౌట్; 11 బంతుల్లో), అశ్విన్ ఉన్నాడు.
𝐏𝐚𝐧𝐭 𝐩𝐨𝐰𝐞𝐫𝐬 𝐮𝐩 💪
— JioCinema (@JioCinema) November 3, 2024
Watch the 3rd #INDvNZ Test as #TeamIndia chase victory, LIVE on #JioCinema, #Sports18 and #ColorsCineplex 👈#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/NPBNUJf5Y7
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications