IND vs NZ: చరిత్ర సృష్టించిన జడేజా!
వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అయిదో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్‌లను 311 వికెట్ల టెస్టు రికార్డును అధిగమించాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు.
అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు-132 టెస్టులు), రవిచంద్రన్ అశ్విన్ (533 వికెట్లు- 105 టెస్టులు), కపిల్ దేవ్ (434 వికెట్లు- 131 టెస్టులు), హర్భజన్ సింగ్ (417 వికెట్లు- 103 టెస్టులు), రవీంద్ర జడేజా (314 వికెట్లు- 77 టెస్టులు) టాప్-5లో ఉన్నారు. జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311 వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ 105 టెస్టుల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు.

కాగా, టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను సాధించడం జడేజాకు 14వ సారి. జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (82; 129 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విల్ యంగ్ (71; 138 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ టామ్ లాథమ్ (28; 44 బంతుల్లో, 3 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17; 28 బంతుల్లో, 1 ఫోర్) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే (4)ను ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ యంగ్‌తో కలిసి టామ్ లాథమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాలని ప్రయత్నించాడు. కానీ వీరిద్దరి 44 పరుగుల భాగస్వామ్యానికి సుందర్ తెరదించాడు. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్రను సుందర్ బోల్తాకొట్టించాడు. అనంతరం వికెట్ల వేటను జడేజా మొదలుపెట్టాడు.ఒకే ఓవర్‌లో రెండు వికెట్లను రెండు సందర్భాల్లో తీసి న్యూజిలాండ్‌ను జడ్డూ కోలుకోలేని దెబ్బతీశాడు.
Jadeja stuns the Kiwis with a double strike 💥
— JioCinema (@JioCinema) November 1, 2024
Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications