
రోహిత్-రాహుల్‌నే కొనసాగించాలి:
స్కై క్రికెట్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ రోహిత్ శర్మను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను ఆడించింది. ఆ సమయంలో లోకేష్ రాహుల్‌తో కలిసి అతడు ఓపెనింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ కన్నా ఇషాన్ బాగా ఆడినా.. పవర్‌ప్లేలో రాహులే ధాటిగా ఆడాడు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. మరోవైపు రోహిత్ ఆటను పరిశీలిస్తే.. తొలుత కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత చెలరేగిపోతాడు. అలాంటప్పుడు భారత్.. రోహిత్-రాహుల్ కాంబినేషన్‌ను ఆడించడం సరైన నిర్ణయమే. వీరిద్దరినీ ఇలాగే కొనసాగించాలి' అని అన్నాడు.

టీమిండియాను తక్కువ చేసి చూడొద్దు:
పాకిస్థాన్‌తో ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన భారత జట్టును తక్కువ చేసి చూడొద్దు అని మైక్ అథర్టన్ పేర్కొన్నాడు. భారత్ ఎపుడూ పటిష్ట జట్టు అని, ఇప్పటికైనా పుంజుకునే సామర్థ్యం ఆ జట్టుకుందని అబిప్రాయపడ్డాడు. లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి సీనియర్లు.. ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి యువకులు జట్టుకు అందుబాటులో ఉన్నారన్నాడు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగుందని.. న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాదిస్తుందని అథర్టన్ ధీమా వ్యక్తం చేశాడు.

తప్పక గెలవాల్సిన పరిస్థితి:
టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీ మొదటి మ్యాచ్ కావడం, అదికూడా పాకిస్థాన్‌పై ఓడిపోవడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురిసింది. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ సైతం పాక్ చేతిలో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. భారీగా పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచులో తేలిపోయిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications












