Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS NZ: 'అరే ఎంట్రా ఇది'.. కోహ్లీ ఔట్‌పై లేడీ ఫ్యాన్ రియాక్షన్ వైరల్

ఎన్నో అంచనాలతో తన 300వ వన్డే మ్యాచ్ బరిలోకి దిగన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. దూకుడుగా ఆడే క్రమంలో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాథ్యూ హెన్రీ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

స్టన్ అయిన కోహ్లీ..
కోహ్లీ బాదిన షాట్ కు బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తోన్న కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా క్యాచ్ ఒడిసి పట్టాడు. ఎడమవైపునకు గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్ డైవ్ క్యాచ్ పట్టుకున్నాడు ఫిలిఫ్స్. అతడు క్యాచ్ విన్యాసానికి కోహ్లీ కూడా బిత్తరపోయాడు. దీంతో 30 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత్.

Ind vs Nz kohli out fans reactions on social media goes viral in champions trophy 2025

సోషల్ మీడియా రియాక్షన్
రీసెంట్ గా పాకిస్థాన్ పై సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. తన కెరీర్ 300వ మ్యాచ్ లోనూ సెంచరీ బాదుతాడని, పలు రికార్డులను బ్రేక్ చేస్తాడని పలువురు క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులంతా ఆశించారు. అతడి ఆటను నేరుగా చూసేందుకు స్టేడియానికి భారీగానే తరలివచ్చారు. కోహ్లీ భార్య అనుష్క శర్మ, సోదరుడు వికాశ్ కోహ్లీ కూడా స్టేడియానికి వచ్చారు. కానీ అందరినీ నిరాశపరుస్తూ కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరగాడు. గ్లెన్ తన క్యాచ్ పట్టినందుకు కోహ్లీ స్టన్ అయితే.. విరాట్ ఔట్ అయినందుకు స్టేడియంలోని ప్రేక్షకులంతా నోరెళ్లబెట్టారు. బాధపడుతూ షాక్ కి గురౌతూ సోషల్ మీడియా వేదికా పోస్ట్ లు పెడుతున్నారు.

సూపర్ మ్యానా అతడు?
'అతడు గ్లెన్ ఫిలిప్సా లేదా సూపర్ మ్యానా', 'సూపర్ హీరోలా ఎగిరి క్యాచ్ పట్టాడు', 'గ్లెన్ ఫిలిప్స్ ను యూనెస్కో ఏలియన్ గా డిక్లేర్ చేయాలి', 'భూమి మీద వేగవంతంగా వెళ్లే వాటిలో చీతా, విమానం, కాంతి తో పాటు గ్లెన్ ఫిలిప్స్ కూడా' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అరే ఏంట్రా ఇది.. వైరల్ గా లేడీ ఫ్యాన్..
అదే సమయంలో కోహ్లీ ఔట్ అవ్వడం చూసి చాలా మంది ఫీలైపోతున్నారు. నోరెళ్ల బెడుతూనే బాధపడుతూ కనిపించారు. స్టేడియంలోని ఫ్యాన్స్ హావాభావాలు, రియాక్షన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ అమ్మాయి అయితే చాలా షాక్ తో బాధపడుతూ కెమెరా కంటికి చిక్కింది. అరే ఏంట్రా ఇది అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది. ఈ పోస్ట్ అయితే తెగ చక్కర్లు కొడుతోంది.

Story first published: Sunday, March 2, 2025, 16:16 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+