సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు రెస్ట్?

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమైన టీ20 ప్రపంచ కప్ 2022లో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన అధికారిక వామప్ మ్యాచ్‌లో సత్తా చాటింది. ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ గడ్డపై చుక్కలు చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించారు. 186 పరుగుల లక్ష్యాన్ని అందుకోనివ్వకుండా ఆసీస్ ప్లేయర్లను కట్టడి చేశారు. చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ విజృంభణ ఏ రేంజ్‌లో సాగిందో చూశాం.

మరో వామప్..
టీమిండియా ఇప్పుడు మరో వామప్ మ్యాచ్‌కు సిద్ధపడుతోంది. న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది. భారత కాలమానం ప్రకారం- బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. వామప్స్‌లల్లో ఇదే చివరి మ్యాచ్. దీని తరువాత సూపర్ 12 మొదలవుతుంది. 22వ తేదీ నుంచి సూపర్ 12 ఉంటుంది. ఈ దశలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొడుతుంది.

పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం..
కాగా- పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సిన ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వామప్ కోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనుంది టీమ్ మేనేజ్‌మెంట్. మిడిలార్డర్ బ్యాటర్, సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతన్ని వామప్ కోసం ఆడించదలచుకోలేదు మేనేజ్‌మెంట్. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం విశ్రాంతిని ఇవ్వడం వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాపై వామప్‌లో అర్ధసెంచరీతో సత్తా చాటుకున్న నేపథ్యంలో అతణ్ని డగౌట్‌కే పరిమితం చేయొచ్చు.

పంత్‌కు ఛాన్స్?
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను తుదిజట్టులోకి తీసుకోవడానికే అధికావకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై జరిగిన వామప్‌లో ఆడలేదు రిషభ్ పంత్. సూపర్ 12లో భాగంగా ఈ నెల 23వ తేదీన పాకిస్తాన్‌పై జరిగే మ్యాచ్ కోసం ఎంపిక చేసే తుదిజట్టులో పంత్‌ను చోటు కల్పించే పరిస్థితి ఉన్నందున- న్యూజిలాండ్‌పై వామప్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పుతో వామప్ కోసం టీమిండియా సన్నద్ధం కావొచ్చు.

కివీస్ కూడా..
న్యూజిలాండ్ కూడా తుదిజట్టులో పలు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్‌లో ఘోరంగా ఓడిందా జట్టు. 100 పరుగులు కూడా చేయలేకపోయింది. మార్టిన్ గప్టిల్-26, గ్లెన్ ఫిలిప్స్-20 మాత్రమే కొద్దో గొప్పో పరుగులు చేశారు. మిగిలిన వారెవరూ దక్షిణాఫ్రికా బౌలర్లను తట్టుకుని క్రీజ్‌లో నిలవలేకపోయారు. దీనితో డెవాన్ కాన్వే, జిమ్మీ నీషమ్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications