Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: భారత్ ఘోర పరాజయం..న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

మరోవైపు స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కు గురికావడం భారత్‌కు ఇదే తొలిసారి. ఛేదన ఆరంభం నుంచి భారత్ తడబడింది. 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా (6)తో కలిసి పంత్ ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పంత్ ఉన్నంతసేపే టీమిండియా విజయం దిశగా సాగింది.

IND vs NZ Historic Triumph New Zealand Whitewashes India on Their Home Soil

పంత్ మినహా భారత్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. రోహిత్ శర్మ (11), వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 8, రవీంద్ర జడేజా 6, యశస్వీ జైస్వాల్ 5, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ తలో ఒక్క పరుగు చేశారు. కాగా, అంతకుముందు 171/9 మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్ మరో 14 బంతులే ఎదుర్కొని, మూడు పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (51; 100 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. గ్లెన్ ఫిలిప్స్ (26; 14 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (22; 47 బంతుల్లో, 2 ఫోర్లు), డారిల్ మిచెల్ (21; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 65.4 బంతుల్లో 235 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (82; 129 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విల్ యంగ్ (71; 138 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. రవీంద్ర జడేజా అయిదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది.

శుభ్‌మన్ గిల్ (90; 146 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషభ్ పంత్ (60; 59 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ అయిదు వికెట్లు తీశాడు. ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, November 3, 2024, 13:14 [IST]
Other articles published on Nov 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+