For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: భారత టెస్టు చరిత్రలో తొలిసారి... ఆల్‌టైమ్ రికార్డు!

పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ 79.1 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (76; 141 బంతుల్లో, 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌ను అశ్విన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. కెప్టెన్ టామ్ లాథమ్‌ (15) వికెట్ల ముందు దొరకబుచ్చకున్నాడు. కాసేపటికే విల్ యంగ్ (18)ను కూడా యాష్ ఔట్ చేశాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్‌తో కలిసి కాన్వే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ మరోసారి విజృంభించి టాప్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.

IND vs NZ Historic First for India as Right-Arm Off-Spinners Claim All Ten Wickets in a Men s Test Innings

ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వికెట్ల వేటను ప్రారంభించాడు. మిగిలిన అన్ని వికెట్లను తన ఖాతాలోనే వేసుకుని కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు అందుకున్నాడు. సుందర్ సాధించిన ఏడు వికెట్లలో అయిదు బౌల్డ్ చేయడంతోనే సాధించాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తాకొట్టించాడు. అయితే ఇద్దరు కలిసి కివీస్ 10 వికెట్లు తీసిన అశ్విన్-సుందర్.. అరుదైన ఘనతలు సాధించారు.

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లను పడగొట్టిన తొలి కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్ల భారత జోడీగా సుందర్ - అశ్విన్ రికార్డు సాధించారు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అంతకుముందు వరకు ఓ ఇన్నింగ్స్‌లో పది వికెట్లను కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్లే తీయలేదు. ఈ ఆల్‌టైమ్ రికార్డును యాష్-వాషింగ్టన్ నెలకొల్పారు. కాగా, భారత్‌ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది.

ఇదే ఏడాది ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో భారత్ స్పిన్నర్లు తొలి రోజు పది వికెట్లు పడగొట్టాడు. అలాగే 1973లో (వర్సెస్ ఇంగ్లండ్), 1964లో (వర్సెస్ ఆస్ట్రేలియాపై), 1956లో (వర్సెస్ ఆస్ట్రేలియా) తీశారు. 1952లో భారత్‌పై ఇంగ్లండ్ స్పిన్లర్లు ఈ ఘతన సాధించారు.

Story first published: Thursday, October 24, 2024, 16:25 [IST]
Other articles published on Oct 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+