Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: సౌథాంప్టన్‌లో ఇలా ఆడుతున్న ప్లేయర్స్.. అచ్చం టైటానిక్‌లానే!!

IND VS NZ Hilarious Trolls: Leaked scenes Of Playing WTC Final 2021 At Southampton

హైదరాబాద్: 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సిద్ధమవుతున్నాయి. క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి‌ప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కోహ్లీ సేన, కేన్ సేన మరికొద్దిసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు స్థానిక ఏజెస్‌ బౌల్‌ వేదిక కానుంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ దాకా చేరిన ఇరు జట్లు టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కోహ్లీ సేన ఆధ్వర్యంలోనూ తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.అయితే ఫైనల్‌కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు.

సౌథాంప్టన్‌లో వర్షసూచన

సౌథాంప్టన్‌లో వర్షసూచన

మ్యాచుకు ముందురోజు గురువారమే సౌథాంప్ట‌న్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఇక ఫైనల్ మ్యాచ్ మొదటి రోజైన శుక్రవారం ఉదయం కూడా వర్షం పడింది. ఇప్పటికీ సౌథాంప్టన్‌లో వర్షసూచన కనిపిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌ సవ్యంగా సాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ భారీ వర్షం కురవకపోయినా చిరుజల్లులు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖలు అంటున్నాయి.

90% వర్షం కురుస్తుందని అంచనా

90% వర్షం కురుస్తుందని అంచనా

పలు వాతావరణ సమాచార వెబ్‌సైట్ల ప్రకారం సౌథాంప్టన్‌లో శుక్రవారం 90% వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. మధ్యాహ్నం 95%, సాయంత్రం 47%, అర్ధరాత్రి 16% వర్షం కురుస్తుందని పేర్కొంటున్నాయి. మ్యాచ్‌ జరిగే ఐదు రోజులు వరుణుడు 'టెస్టు మ్యాచ్‌' ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 'శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవచ్చు. సుదీర్ఘ సమయం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో వాన పడేందుకు ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు ఉరుములతో కూడిన వర్షం పడనుంది' అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది.

WTC Final 2021 ముందు ఫొటోషూట్‌..టీమిండియా ఆటగాళ్ల పోజులు చూస్తే నవ్వులేనవ్వులు!వేరే లెవెల్(వీడియో)

ఫైనల్ జరగడం కష్టమే

అక్యువెద‌ర్ అనే వాతావ‌ర‌ణ వెబ్‌సైట్ ప్ర‌కారం తొలి రోజు వ‌ర్షం ప‌డే అవ‌కాశం 65 శాతం ఉంది. రెండో రోజు 60 శాతం, మూడో రోజు 56 శాతం, నాలుగో రోజు 65 శాతం, ఐదో రోజు 63 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు మ్యాచ్ ఫ‌లితంపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి. మ్యాచ్ కోసం ఆరో రోజును రిజ‌ర్వ్ డేగా ఉంచిన విష‌యం తెలిసిందే. ఆ రోజు మాత్రం కేవ‌లం 25 శాతం మాత్ర‌మే వ‌ర్షం ప‌డే చాన్స్ ఉందట. ఏదేమైనా అన్ని నివేదికలకు చెప్పేది ఒక్కటే.. పూర్తిస్థాయిలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం కష్టమే అని.

ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని

ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని

ఇప్పటి వరకు సౌథాంప్టన్‌లో వాతావరణం ఎలా ఉందో ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ నెలకొనడంతో.. ఐసీసీపై సెటైర్లు వేస్తున్నారు. మీమ్స్, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'ఇంగ్లండ్‌లో ఈ సమయంలో వర్షం పడుతుందని ఐసీసీకి తెలియదా?', 'తొలి ఐసీసీ ట్రోఫీ గెలుద్దామనుకున్న కోహ్లీకి నిరాశే', 'ఐసీసీ.. ఎంత పనిచేసింది?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

'సౌథాంప్టన్‌ మైదాన నీటిలో ఆడుతున్న ప్లేయర్స్' అని ఒకరు మీమ్ క్రియేట్ చేశారు. అందులో కీపర్, బ్యాట్స్‌మన్‌ ఆక్సిజెన్ సిలిండర్లు వేసుకొని మ్యాచ్ ఆడన్నారు. అచ్చం టైటానిక్‌ సినిమాలానే ఉంది అని ఈ ఫొటోపై కెమెంట్లు వస్తున్నాయి.

Story first published: Friday, June 18, 2021, 14:37 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+