IND vs NZ: చరిత్ర సృష్టించిన జియో హాట్‌స్టార్.. వ్యూయర్‌షిప్ రికార్డ్స్ అన్నీ బద్దలు!
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 థ్రిల్లింగ్ ఫైనల్ లో భారత్ తిరుగులేని విజయం సాధించి విజయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ వ్యూవర్‌షిప్ కూడా భారీ రికార్డ్ కూడా సాధించింది. ఈ మ్యాచ్ ను భారీ సంఖ్యలో అభిమానులు వీక్షించారు.
మొదట ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. అప్పుడు ఈ రసవత్తరమైన పోరును జియో హాట్‌స్టార్‌లో దాదాపు 66 కోట మంది వీక్షించారు. అంతకుముందు ఫిబ్రవరి 23న జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ను 60.2 కోట్ల మంది చూశారు. ఇప్పుడా వ్యూవర్‌షిప్ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది ఫైనల్ మ్యాచ్ వ్యూవర్‌షిప్.

భారత్ ఇన్నింగ్స్ సమయంలో భారీగా..
మొదట న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు 39.7 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఆడే సమయంలో ఆ వ్యూవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయాయి. రోహిత్ శర్మ, గిల్ భాగస్వామ్యం నెలకొల్పేటప్పుడు, కోహ్లీ ఔట్ అయ్యే సమయంలో వ్యూవర్‌షిప్ భారీగా ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా 90.1 కోట్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం అందింది.
PUNJAB KINGS EDIT FOR VIRAT KOHLI AND ROHIT SHARMA. 🔥🔥🔥pic.twitter.com/Ist9KrOMQw
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025
మ్యాచ్ సాగిందిలా..
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 252 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7×4, 3×6) కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications