రోహిత్ కెప్టెన్సీకి టేక్ ఏ బౌ.. 8 బంతుల గ్యాప్‌లో 2 డేంజరస్ వికెట్లు హాంఫట్!!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్ కు డేంజర్ గా నిలుస్తాడనుకున్న కీలక వికెట్ రచిన్ రవీంద్ర కు గట్టి దెబ్బ పడింది.ఈ తుది పోరులో దూకుడుగా ఆడుతోన్న రచిన్ రవీంద్రకు కుల్దీప్ యాదవ్ అడ్డుకట్ట వేశాడు. తన అదిరే బౌలింగ్ తో వచ్చీ రాగానే మొదటి బంతికే రచిన్ (37) పెవిలియన్ కు పంపాడు.
సూపర్ డెలివరీ (10.1వ ఓవర్)తో రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ జట్టు 69 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.
WHAT A BALL BY KULDEEP. 🤯pic.twitter.com/zFgXsZPGab
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
రెండు సార్లు మిస్..
వాస్తవానికి ఈ ట్రోఫీలో ఇప్పటికే రెండు సెంచరీలతో దూకుడు మీదున్నాడు రచిన్ రవీంద్ర. దీంతో ఈ తుదిపోరులోనూ అతడు మరో శతకం బాదుతాడని అంతా అనుకున్నారు. అందరూ భావించినట్టుగానే మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి అతడు జాగ్రత్తగా ఆడుతూనే కాస్త దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే రెండు సార్లు అతడు ఔట్ కు దగ్గరగా వెళ్లి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో అతడికి రెండు లైఫ్ లైన్లు వచ్చాయి. షమీ ఓ సారి, శ్రేయస్ అయ్యర్ మరోసారి రచిన్ క్యాచ్ లను మిస్ చేశారు.

రోహిత్ కెప్టెన్సీకి టేక్ ఏ బౌ..
ఈ క్రమంలో రోహిత్ శర్మ తన తెలివిని ప్రదర్శించాడు. తన అద్భుతమైన కెప్టెన్సీని ఉపయోగించాడు. బౌలింగ్ ను ఛేంజ్ చేసి వరుణ్ చక్రవర్తి నుంచి కుల్దీప్ యాదవ్ కు బంతిని అందించాడు. అతడు వచ్చీ రాగానే తొలి బంతికే.. తన స్పిన్ మ్యాజిక్ తో జోరు మీదున్న రచిన్ రవీంద్రను ఔట్ చేశాడు. ఆ తర్వాత 8 బంతుల వ్యవధిలో మరో కీలక వికెట్ కేన్ విలియమ్సన్ (11)ను వెనక్కి పంపాడు. దీంతో న్యూజిలాండ్ 75 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది.
KULDEEP YADAV ON FIRE IN THE CT FINAL - RACHIN AND KANE IN 8 BALLS. 🔥pic.twitter.com/lPivfA8lyj
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
అలా 8 బంతుల వ్యవధిలో 2 కీలక వికెట్లు పడడంతో.. ప్రతిఒక్కరూ ఈ క్రెడిట్ ను కుల్దీప్ యాదవ్ తో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీకి కూడా ఇస్తున్నారు. రోహిత్ శర్మ వ్యూహాలు రచించడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడంలో గొప్ప కెప్టెన్ అని ప్రశంసిస్తున్నారు. సరైన్ సమయంలో బౌలింగ్ ఛేంజ్ చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications