Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ Day 2: టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్‌కే: మూడు కారణాలు ఇవే..

 IND vs NZ Day 2: Why winning the toss and batting first will be a right thing, here is reasons

లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ తొలిరోజును తుడిచి పెట్టేసిన వరుణ దేవుడు.. కాస్త కరుణించాడు. రెండో రోజు ఆటకు అవకాశం కల్పించాడు. ఉదయం వేళ వర్షం పడే అవకాశం లేదంటూ బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో.. రెండు జట్లూ ఫైనల్ సమరానికి సమాయాత్తం కానున్నాయి. కనీసం రెండు సెషన్ల మ్యాచ్ సజావుగా సాగడానికి వీలుంది. దీనితో భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడొచ్చు. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తోన్నప్పటికీ- ఉదయం పూట కొన్ని గంటలపాటు తెరపినివ్వడం దాదాపు ఖాయమైనట్టే.

టాస్‌పై ఫోకస్..

టాస్‌పై ఫోకస్..

ఇక వర్షం పడటం ఆగుతుందని తేలడంతో అందరి దృష్టీ మ్యాచ్‌పై మళ్లింది.. టాస్‌పై పడింది. వరుణుడి ప్రభావం తీవ్రంగా పడిన ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారింది. వర్షం అంతరాయాన్ని కలిగించకపోతే- టాస్ గెలిచిన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయనేది క్రికెట్ పండితుల విశ్లేషణ. కాలం గడుస్తున్న కొద్దీ పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని, అది టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ సెషన్‌కు ఉపకరిస్తుందని అంటోన్నారు. ప్రత్యేకించి- స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని చెబుతోన్నారు.

 బౌలింగ్‌కు అనుకూలంగా..

బౌలింగ్‌కు అనుకూలంగా..

టాస్ గెలిస్తే- టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. ఆ తరువాత ఫీల్డింగ్‌లోకి దిగినప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను కట్టిపడేయగలరని జోస్యం చెబుతున్నారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల తొలి ఇన్నింగ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు బౌండరీలను సాధించడానికి కొంత శ్రమించాల్సి వచ్చినప్పటికీ.. అది ఎంతో సేపు ఉండదని అంటున్నారు. ఒక్కసారి గ్రౌండ్ తడి ఆరిన తరువాత బుల్లెట్ వేగంతో బంతి బౌండరీ లైన్‌ను దాటడానికి అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు.

 టీమిండియాకు చుక్కెదురు..

టీమిండియాకు చుక్కెదురు..

సౌథాంప్టన్ స్టేడియంలో భారత జట్టు చివరిసారిగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఇంగ్లాండ్ జాతీయ జట్టుతో ఆడిన మ్యాచ్‌లవి. ఈ రెండింట్లోనూ ఇంగ్లాండ్ జట్టే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. 2014, 2018ల్లో ఆడిన ఈ రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. 2014 నాటి మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు తేడాతో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. 2018లో ఆంతర్యం తగ్గిందే గానీ.. పరాజయం వీడలేదు. ఆ మ్యాచ్‌ను 60 పరుగుల తేడాతో ప్రత్యర్థికి ధారదాత్తం చేసింది. ఆ తరువాత.. టీమిండియా మళ్లీ సౌథాంప్టన్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.

ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ అధికం..

ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ అధికం..

సౌథాంప్టన్ గ్రౌండ్‌లో ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ అధికంగా ఉంటోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జట్టు చేసిన సగటు పరుగులు 337. రెండో ఇన్నింగ్ యావరేజ్ 280 పరుగులు. అదే మూడో ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 262 పరుగులు కాగా.. ఫోర్త్ ఇన్నింగ్ సగటు 187 పరుగులుగా ఉంటోంది. దీన్ని బట్టి చూసినా.. ఎంత కీలక పాత్ర పోషిస్తోందనేది అర్థమౌతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుదే అప్పర్ హ్యాండ్‌గా ఉంటోంది సౌథాంప్టన్ రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియంలో. ఈ నేపథ్యంలో- వర్షం వల్ల ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే విరాట్ కోహ్లీ ఎటు వైపు మొగ్గు చూపుతాడనేది ఆసక్తి రేపుతోంది.

Story first published: Saturday, June 19, 2021, 9:46 [IST]
Other articles published on Jun 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+