ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కివీస్ జట్టు ఓటమికి గల కారణాలను క్రికెట్ అభిమానులు విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కివీస్ జట్టు ఓటమి కారణం మాజీ సీఎస్కే ప్లేయర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ క్రికెట్ అభిమానులు చెబుతోన్న కివీస్ ఓటమికి కారణం ఏంటి, ఈ ఓటమికి ఎవరిని బాధితుడిని చేస్తున్నారో తెలుసుకుందాం..
ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోవడానికి భారత జట్టు ఊపించినట్టుగానే స్పిన్ తో బరిలోకి దిగి ఉచ్చుబిగించింది. అయితే కివీస్ మొదట ఇన్నింగ్స్‌ను మంచిగానే ప్రారంభించింది. అప్పుడు భారత్.. స్పిన్ మాయతో మొదట యంగ్ ను ఔట్ చేసింది. ఆ తర్వాత దాటిన ఆడిన రచిన్ రవీంద్రను కుల్దీప్ ఎంట్రీ ఇచ్చి పెవిలియన్ పంపాడు.

ఆ దశలోనే నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ వికెట్లు పడకుండా ఆచితూచి ఆడాడు. అక్షర్, కుల్‌దీప్, వరుణ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా డారిల్ పట్టుదలతోనే క్రీజులోనే పాతుకుపోయాడు విలువైన భాగస్వామ్యాలతో జట్టును కాస్త అండగా నిలిచాడు. లేథమ్ (14)తో నాలుగో వికెట్‌కు 33 పరుగులు, ఫిలిప్స్ (34)తో ఐదో వికెట్‌కు 57 పరుగులు, బ్రాస్‌వెల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే 91 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్ హిస్టరీలోనే అది చాలా స్లో హాఫ్ సెంచరీ. ఫైనల్ గా అతడు అనూహ్యంగా 46వ ఓవర్లో మిచెల్ ఔట్ అయ్యాడు. మొత్తంగా 101 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి తాబేలు లాంటి స్లో ఇన్నింగ్స్ తోనే న్యూజిలాండ్ 45వ ఓవర్ లో 200 పరుగులు దాటగలిగింది.
A fighting innings in Dubai! Daryl Mitchell reaches 50 for the 14th time in ODIs and the third time against India. Watch play LIVE in NZ on @skysportnz 📺 LIVE scoring | https://t.co/RncigaQ2km 📲 #ChampionsTrophy #CricketNation pic.twitter.com/3Wf941z9DZ
— BLACKCAPS (@BLACKCAPS) March 9, 2025
ఓటమికి అదే కారణం...
కానీ నెటిజన్లు, కొంతమంది క్రికెట్ అభిమానులు డారిల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతడి స్లో ఇన్నింగ్స్ ను ఒప్పుకోవట్లేదు. అతడు కాస్త దూకుడుగా నైనా ఆడి ఉంటే కివీస్ ఇంకాస్త ఎక్కువ పరుగులు, కనీసం 20 పరుగులు అయినా ఎక్కువగా చేసేదని విమర్సిస్తున్నారు. అలాగే ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని చెబుతున్నారు.
Batting first in the ICC Champions Trophy Final after a toss win for Mitch Santner. One change to the XI - Matt Henry is ruled out after failing a fitness test at the ground before play and is replaced by Nathan Smith. Watch play LIVE in NZ on @skysportnz 📺 #ChampionsTrophy pic.twitter.com/Eb2NGdY8aS
— BLACKCAPS (@BLACKCAPS) March 9, 2025
సీఎస్కే తరహాలో...
డారిల్ మిచెల్ సీఎస్కేకు గతంలో ప్రాతినిథ్యం వహించాడు. అయితే సీఎస్కే హోం స్టేడియం చెపాక్ పిచ్.. దుబాయ్ పిచ్ తరహాలో స్పిన్ కు కూలంగా ఉంటుంది. అందుకే సీఎస్కే కూడా ఐపీఎల్ లో మిడిల్ ఓవర్స్ లో స్లో ఇన్నింగ్స్ ఆడుతూ తక్కువ పరుగులు చేస్తుందని పలువురు అంటుంటారు! డారిల్ మిచెల్ కూడా ఆ ఫార్మూలానే ఇక్కడ దుబాయ్ పిచ్ పై ఫైనల్ మ్యాచులో ఉపోయోగించాడని చెబుతున్నారు. పైగా అతడి స్లో ఇన్నింగ్స్ కూడా కివీస్ ఓటమికి ఓ కారణం అని అంటున్నారు.